Tamannaaah: ఆ హీరోతో ఐటమ్‌సాంగ్.. ఆ కథనాలు నన్నెంతో బాధించాయి: తమన్నా
బాలకృష్ణ (Balakrishna) - అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా గురించి తమన్నా (Tamannaaah) ట్వీట్ చేశారు.
హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ (Balakrishna), దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబోలో ఓ సరికొత్త చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇందులోని ఓ స్పెషల్ సాంగ్ కోసం చిత్రబృందం తమన్నా(Tamannaaah)ని సంప్రదించగా, ఆమె రూ.కోటిన్నర డిమాండ్ చేసిందని ఇటీవల పలు కథనాలు వెలువడ్డాయి. ఆయా వార్తలపై తాజాగా తమన్నా స్పందించారు. ఈ వార్తలు తనని ఎంతో బాధించాయని అన్నారు.
‘‘దర్శకుడు అనిల్ రావిపూడితో వర్క్‌ని నేను ఎప్పుడూ ఎంజాయ్ చేస్తాను. అనిల్ రావిపూడి, బాలకృష్ణపై నాకెంతో గౌరవం ఉంది. నా గురించి, వాళ్ల సినిమాలో నేనొక స్పెషల్ సాంగ్ చేస్తున్నానంటూ వస్తోన్న నిరాధారమైన వార్తలను చూసి నేనెంతో చింతిస్తున్నా. ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసేముందు దయచేసి రీసెర్చ్ చేసి తెలుసుకోండి’’ అని తమన్నా రాసుకొచ్చారు. ఈ ట్వీట్‌తో బాలయ్య సినిమాలో తమన్నా స్పెషల్ సాంగ్ చేయనుందంటూ జరుగుతున్న ప్రచారానికి పుల్‌స్టాప్ పడింది.
NBK 108గా ఈ సినిమా ప్రచారంలో ఉంది. యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఇది సిద్ధమవుతోంది. కాజల్ అగర్వాల్, శ్రీలీల, అర్జున్ రాంపాల్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది. ఇక, తమన్నా కెరీర్ విషయానికి వస్తే.. ‘భోళా శంకర్’, ‘జైలర్’, ‘బాంద్రా’, ‘అరణ్మనై 4’ వంటి చిత్రాల్లో ఆమె నటిస్తున్నారు. గతంలో మహేశ్‌బాబు కథానాయకుడిగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’లో తమన్నా స్పెషల్ సాంగ్ కోసం తళుక్కున మెరిశారు. అనిల్ రావిపూడి ఆ చిత్రానికి దర్శకత్వం వహించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
TSPSC Paper Leak: చాట్ జీపీటీతో జవాబులు.. ఎలక్ట్రానిక్ డివైస్‌తో చేరవేత!
-
Sports News
MS Dhoni: ‘కెప్టెన్ కూల్’ మరో ఘనత.. ఐపీఎల్లో తొలి క్రికెటర్‌గా ధోనీ రికార్డు
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Crime News
Mangalagiri: రెండేళ్ల చిన్నారిని నేలకేసి కొట్టి చంపిన తండ్రి
-
Ap-top-news News
ISRO: అక్కడే చదివి.. శాస్త్రవేత్తగా ఎదిగి..ఎన్వీఎస్-01 ప్రాజెక్టు డైరెక్టర్ స్ఫూర్తిగాథ
-
India News
Women safety device: మహిళల రక్షణకు ఎలక్ట్రిక్ చెప్పులు