Tamannaah: అలాంటి సీన్స్‌లో నటించడం మానేశా: దక్షిణాది చిత్రాలపై తమన్నా వ్యాఖ్యలు

తెలుగు, తమిళం చిత్రాలతో స్టార్‌గా గుర్తింపు తెచ్చుకుని.. ప్రస్తుతం బాలీవుడ్‌లోనూ వరుస సినిమాలు చేస్తున్నారు నటి తమన్నా (Tamannaah). తాజాగా ఆమె దక్షిణాది చిత్రాలను ఉద్దేశిస్తూ మాట్లాడారు.

Published : 27 Sep 2023 20:22 IST

ముంబయి: దక్షిణాది, బాలీవుడ్‌లోనూ వరుస ప్రాజెక్ట్‌లు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు నటి తమన్నా (Tamannaah). తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. దక్షిణాది చిత్ర పరిశ్రమ గురించి మాట్లాడారు. నటి కావాలనే ఆశతో పరిశ్రమలోకి అడుగుపెట్టానని.. ఇప్పుడు తానొక స్టార్‌ని అయ్యానని అన్నారు. ప్రేక్షకులకు వినోదాన్ని అందించడం కోసమే తాను ఇప్పటికీ శ్రమిస్తున్నానని చెప్పారు.

‘దక్షిణాదిలో హీరోయిజాన్ని హైప్‌ చేసే సినిమాలు ఎక్కువగా ఉంటాయి కదా. హీరోయిజాన్ని ఎక్కువగా చూపించడం కారణంగా మీరు నటించనని ఎప్పుడైనా చెప్పారా?’ అని విలేకరి ప్రశ్నించగా.. ‘‘దక్షిణాదిలో సులువుగా ఉండే కొన్ని ఫార్ములాలు ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా కొన్ని కమర్షియల్‌ సినిమాల్లో నా పాత్రకు ఇబ్బంది లేకుండా.. హీరోయిజం తీవ్రతను తగ్గించమని దర్శకులను కోరిన సందర్భాలు ఉన్నాయి. రాను రాను ఇలాంటి సన్నివేశాలు చేయడం మానేశా. అలాంటి సినిమాలకూ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా’’ అని ఆమె బదులిచ్చారు.

Social Look: ఫ్యాషన్‌ షోలో ఖుషి.. దివి స్టైలిష్‌ అవతార్‌

అనంతరం ఆమె బాలీవుడ్‌లో సక్సెస్‌ కాలేకపోవడంపై మాట్లాడుతూ.. ‘‘బాలీవుడ్‌లో నేను నటించిన పలు సినిమాలు సరిగ్గా ఆడలేదు. అది విధి. దానిని నేను వ్యక్తిగత ఫెయిల్యూర్‌గా ఎప్పటికీ తీసుకోను ఎందుకంటే, ఎంతోమంది కలిసి వర్క్‌ చేస్తేనే ఒక సినిమా సిద్ధం అవుతుంది’’ అని ఆమె చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని