Tejas: ఓటీటీలోకి కంగనా రనౌత్‌ ‘తేజస్‌’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

కంగనా రనౌత్‌ ‘తేజస్‌’ సినిమా ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఖరారైంది. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

Published : 26 Dec 2023 17:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ (Kangana Ranaut) ప్రధాన పాత్రలో సర్వేశ్‌ మేవారా తెరకెక్కించిన చిత్రం ‘తేజస్‌’ (Tejas). తాజాగా ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. ‘జీ 5’ (Zee 5)లో 2024 జనవరి 5 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ అక్టోబరు 27న థియేటర్లలో విడుదలైంది. 2016లో భారత వైమానిక దళంలోకి మొట్టమొదటి సారిగా మహిళలకు ప్రవేశాన్ని కల్పించిన సంఘటన ఆధారంగా ఈ సినిమా రూపొందింది. పాకిస్థాన్‌లో చేపట్టే ఓ రహస్య ఆపరేషన్‌లో పాల్గొనే పైలట్‌గా కంగన నటించారు.

రాజమౌళి నా డ్యాన్స్‌ను ప్రశంసించడం మర్చిపోలేను: శ్రుతి హాసన్‌

కంగనా ఈ ఏడాది ఈ సినిమాతోపాటు ‘చంద్రముఖి 2’తో ప్రేక్షకులను పలకరించారు. ఈ రెండూ ఆమెకు విజయాన్ని అందించలేకపోయాయి. ప్రస్తుతం ఆమె ‘ఎమర్జెన్సీ’తో బిజీగా ఉన్నారు. భారతదేశపు మొదటి మహిళా ప్రధాని ఇందిరా గాంధీ రాజకీయ జీవితం ఆధారంగా రూపొందుతోన్న చిత్రమిది. కంగనా రనౌత్‌ దర్శకత్వం వహించడం విశేషం. ఇప్పటికే విడుదలకావాల్సిన ఈ సినిమా వచ్చే ఏడాదికి వాయిదా పడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని