Telugu Movies: ఈ వారం థియేటర్/ఓటీటీలో అలరించే చిత్రాలివే!
Telugu Movies: ఈ వారం థియేటర్, ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రాలు.. వెబ్‌సిరీస్‌లు ఏంటో తెలుసా?
Telugu movies: విద్యార్థుల పరీక్షలు ఇంకా పూర్తికాకపోవడంతో, బాక్సాఫీస్ వద్ద క్రేజీ మూవీలు సందడి చేసేందుకు ఇంకాస్త సమయం పట్టే అవకాశం ఉంది. ఈ క్రమంలో చిన్న సినిమాలన్నీ థియేటర్‌లకు క్యూ కడుతున్నాయి. మరోవైపు ఆసక్తికర చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు ఓటీటీల్లో సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. అలా ఈ వారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఏంటో చూసేయండి.
ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా..
ఆది సాయికుమార్, మిషా నారంగ్ జంటగా శివశంకర్ దేవ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సి.ఎస్.ఐ. సనాతన్’ (CSI Sanatan). హత్య కేసు పరిశోధన నేపథ్యంలో సాగే కథతో సినిమా రూపొందినట్టు ఇటీవల విడుదల చేసిన ప్రచార చిత్రాలు చూస్తే అర్థమవుతోంది. సీఎస్‌ఐ అధికారిగా ఆది సాయికుమార్ కనిపించనున్నారు. అలీ రెజా, నందినిరాయ్, తాకర్ పొన్నప్ప, మధుసూధన్, వాసంతి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మార్చి 10 ఈ సినిమా థియేటర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
థ్రిల్లర్ పంచే ‘ట్యాక్సీ’
వసంత్ సమీర్ పిన్నమరాజు, అల్మాస్ మోటివాలా, సూర్య శ్రీనివాస్, సౌమ్య మేనన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ట్యాక్సీ’(Taxi). హరీష్ సజ్జా(Harish Sajja) దర్శకుడు. హరిత సజ్జా నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ మార్చి 10న విడుదల కానుంది. వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కిన సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా దీన్ని తీర్చిదిద్దారు.
‘నేడే విడుదల’ కథేంటి?
ఆసిఫ్ ఖాన్, మౌర్యాని జంటగా నటిస్తున్న చిత్రం ‘నేడే విడుదల’ (nede vidudala). రామ్‌రెడ్డి పన్నాల దర్శకుడు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా కూడా మార్చి 10న థియేటర్‌లలో విడుదల కానుంది. చిత్ర పరిశ్రమకు సంబంధించిన కథతో ఈ సినిమాను తీర్చిదిద్దినట్లు చిత్ర బృందం చెబుతోంది.
ఇంతకీ వాడు ఎవడు..
కార్తికేయ, అఖిల నాయర్ హీరో-హీరోయిన్లుగా తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘వాడు ఎవడు’ (Vadu Yevadu). ఎన్.శ్రీనివాసరావు దర్శకుడు. ఈ సినిమాను కూడా మార్చి 10న థియేటర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. యథార్థ సంఘటనల ఆధారంగా మూవీని తీర్చిదిద్దినట్లు చిత్ర బృందం చెబుతోంది.
హాలీవుడ్ నుంచి మరో అడ్వెంచర్ మూవీ
యాక్షన్, అడ్వెంచర్ మూవీలకు హాలీవుడ్ కేరాఫ్ అడ్రస్. అక్కడి నుంచి వస్తున్న మరో చిత్రం ‘65’. ఆడమ్ డ్రైవర్, అరియానా గ్రీన్‌బ్లాట్, క్లో కోల్‌మన్ నటించిన చిత్రమిది. స్కాట్ దర్శకత్వం వహించారు. మార్చి 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుక రానుంది. స్పేస్‌షిప్‌లో తెలియని గ్రహానికి వెళ్లిన ఇద్దరు వ్యక్తులకు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అన్న కథతో ఈ సినిమా తెరకెక్కింది.
ఈ వారం ఓటీటీలో చిత్రాలు/ వెబ్‌సిరీస్‌లు
నాలుగు జీవితాల కథ..
దర్శకుడు వెంకటేశ్ మహా, సుహాస్, బిందు మాధవి, మడోనా సెబాస్టియన్, రవీంద్ర విజయ్, ఫణి ఆచార్య కీలక పాత్రల్లో నటిస్తున్న వెబ్‌సిరీస్ ‘యాంగర్ టేల్స్’ (Anger Tales). ప్రభల తిలక్ దర్శకుడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సిరీస్ మార్చి 9వ తేదీ నుంచి డిస్నీ+హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఎన్నో ఆశలతో ఉన్న నలుగురికి.. వారికి నచ్చని జీవితం ఎదురైతే వారి మానసిక సంఘర్షణ ఏంటి? దాని వల్ల వారి జీవితాల్లో చోటు చేసుకున్న పరిణామాలేంటి? అన్న ఆసక్తికర అంశాలతో ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. నటుడు సుహాస్ ఈ సిరీస్‌ను నిర్మిస్తుండటం విశేషం.
బాబాయ్-అబ్బాయి కలిసి..
వెంకటేష్ (Venkatesh), రానా (Rana) తండ్రీకొడుకులుగా నటించిన వెబ్‌సిరీస్ ‘రానా నాయుడు’ (Rana Naidu). ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ ద్వారా మార్చి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటు వెంకటేశ్, అటు రానాకు ఇదే తొలిసారి వెబ్‌సిరీస్. ఇందులో వెంకటేశ్ నాగానాయుడుగా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు సిరీస్‌పై ఆసక్తిని పెంచుతున్నాయి. ‘రే డొనొవాన్’ టీవీ సిరీస్ ఆధారంగా భారతీయ ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా ‘రానా నాయుడు’ను తీర్చిదిద్దారు.
ఓటీటీలో విడుదల కాబోతున్న మరికొన్ని చిత్రాలు.. వెబ్‌సిరీస్..
నెట్‌ఫ్లిక్స్
* రేఖ (మలయాళ చిత్రం) మార్చి 10
* ద గ్లోరీ (వెబ్‌సిరీస్2) మార్చి 10
అమెజాన్ ప్రైమ్
* హ్యాపీ ఫ్యామిలీ: కండీషన్స్ అప్లయ్ (హిందీ సిరీస్) మార్చి 10
డిస్నీ+హాట్‌స్టార్
* చాంగ్ కెన్ డంక్ (మూవీ) మార్చి 10
* రన్ బేబీ రన్ (తమిళ /తెలుగు చిత్రం) మార్చి 10
జీ5
* రామ్‌యో (కన్నడ) మార్చి 10
* బొమ్మై నాయగి (తమిళ్) మార్చి 10
* బౌడీ క్యాంటీన్ (బంగ్లా) మార్చి 10
సోనీ లివ్
* యాక్సిడెంటల్ ఫార్మర్ అండ్ కో (తమిళ్ సిరీస్) మార్చి 10
* క్రిస్టీ (మలయాళం) మార్చి 10
* బ్యాడ్ ట్రిప్ (తెలుగు) మార్చి 10
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Crime News: ముంబయిలో సహజీవన భాగస్వామిని ముక్కలు చేసి..ఆపై కుక్కర్లో ఉడికించి..!
-
General News
Harish Rao: అందుకే మన ‘మిషన్ కాకతీయ’ దేశానికే ఆదర్శం: హరీశ్‌రావు
-
India News
Wrestlers Protest: బ్రిజ్‌భూషణ్‌పై పోక్సో కేసులో ఆమె మైనర్ కాదా..? ఆమె తండ్రి ఏం చెప్పారంటే..?
-
Movies News
Shiva Balaji: జాతకాలు కుదరలేదని బ్రేకప్ చెప్పేసుకున్నాం..: శివ బాలాజీ
-
Crime News
Hyderabad: ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య.. క్షుద్రపూజల వల్లేనంటున్న తల్లిదండ్రులు
-
India News
Air India: ఎట్టకేలకు 39 గంటల తర్వాత.. రష్యా నుంచి అమెరికాకు ఎయిరిండియా విమానం