Telugu movies: ఆగస్టులో అదిరే చిత్రాలు.. వారానికో మెగా హీరో సినిమా!

Telugu movies in august: ఈ ఏడాది వేసవిలో బాక్సాఫీస్‌ వద్ద అలరించిన చిత్రాలు చాలా తక్కువ. ‘దసరా’, ‘విరూపాక్ష’తో పాటు గత నెలలో విడుదలైన ‘సామజవరగమన’, ‘బేబీ’ తదితర చిత్రాలు మాత్రమే ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో వానాకాలంలో వినోదంతో వేడి పెంచేందుకు ఆగస్టులో పలు ఆసక్తికర చిత్రాలు సిద్ధంగా ఉన్నాయి. (telugu movies releasing in august 2023) మరి ఆ సినిమాలేంటి? ఏ వారం ఏ చిత్రాలు వస్తున్నాయో చూసేయండి.

Updated : 01 Aug 2023 14:23 IST

మొదటివారం చిన్న చిత్రాలదే హవా!

త నెల ఆనవాయితీని కొనసాగిస్తూ ఆగస్టు మొదటి వారంలో చిన్న చిత్రాలే సందడి చేస్తున్నాయి. ఇందులో రెండు డబ్బింగ్‌ చిత్రాలు కావడం విశేషం. క్రికెటర్‌ ధోని నిర్మించిన ‘ఎల్‌జీఎం’, కిచ్చా సుదీప్‌ హీరోగా నటించిన ‘హెబ్బులి’ ఆగస్టు 4న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. వీటితో పాటు, ‘కృష్ణగాడు అంటే ఒక రేంజ్‌’, ‘రాజుగారి కోడిపులావ్‌’, విజయ్‌ ఆంటోనీ, సోనూసూద్‌ కీలక పాత్రల్లో నటించిన ‘విక్రమ్‌ రాథోడ్‌’, ‘మిస్టేక్‌’, ‘దిల్‌ సే’, ‘మెగ్‌2’ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఇక హిందీలో ‘పంచ్‌కృతి: ఫైవ్‌ ఎలిమెంట్స్‌’, ‘లఫ్జోన్‌ మే ప్యార్‌’ చిత్రాలు విడుదల కానున్నాయి.


రెండో వారంలో అటు రజనీకాంత్‌.. ఇటు చిరంజీవి..

‘పెద్దన్న’ తర్వాత రజనీకాంత్‌ నుంచి మరో చిత్రం రాలేదు. నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ దర్శకత్వంలో రజనీ నటిస్తున్న తాజా చిత్రం ‘జైలర్‌’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 10న తమిళ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. ఆసక్తికర కథ, కథానాలతో సినిమాలను తీసే, నెల్సన్‌ ‘జైలర్‌’కు దర్శకత్వం వహిస్తుండటంతో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఆగస్టు నెలలో మెగా హీరోలు వరుసగా సందడి చేయనున్నారు. రజనీకాంత్‌ వచ్చిన మరుసటి రోజు థియేటర్‌లో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు అగ్ర కథానాయకుడు చిరంజీవి. మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న ‘భోళా శంకర్‌’ ఆగస్టు 11న విడుదల కానుంది. తమన్నా కథానాయిక. కీర్తిసురేశ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇద్దరు అగ్ర కథానాయకుల సినిమాల మధ్య ఓ చిన్న హీరో సందడి చేయబోతున్నాడు. శ్రీసింహా హీరోగా ఫణిదీప్‌ తెరకెక్కించిన చిత్రం ‘ఉస్తాద్‌’. రజనీ కొర్రపాటి, రాకేష్‌ రెడ్డి గడ్డం, హిమాంక్‌ రెడ్డి దువ్వూరు నిర్మించారు. కావ్యా కల్యాణ్‌రామ్‌ కథానాయిక. గౌతమ్‌ మేనన్‌, రవీంద్ర విజయ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఆగస్టు 12న ఈ చిత్రం విడుదల కానుంది.

రోవైపు హిందీ నుంచి రెండు ఆసక్తికర చిత్రాలు రాబోతున్నాయి. 2012లో వచ్చిన ‘ఓ మై గాడ్‌’ చిత్రానికి కొనసాగింపుగా, ‘ఓ మై గాడ్‌2’ రాబోతోంది. అక్షయ్‌కుమార్‌ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రానికి అమిత్‌రాయ్‌ దర్శకుడు. ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకొస్తోంది. మరో సీనియర్‌ కథానాయకుడు సన్నీదేఓల్‌ నటించిన ‘గదర్‌ 2’ కూడా అదే రోజు విడుదలవుతోంది. ఇవి రెండూ సీక్వెల్స్‌ కావడం విశేషం. మొదటి భాగాలు హిట్‌ అవడంతో ఇప్పుడు రెండో పార్ట్‌పై ప్రేక్షకుల్లో అంచనాలు ఉన్నాయి.


మూడో వారం చిన్న సినిమాలే...

గస్టు మూడో వారంలో పెద్ద సినిమాలేవీ థియేటర్లలోకి రావడం లేదు. ఆగస్టు 18న నాలుగు సినిమాలు విడుదలవుతున్నాయి. వైష్ణవ్‌తేజ్‌ హీరోగా రూపొందిన ‘ఆదికేశవ’, శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహించిన ‘పెదకాపు 1’, సొహైల్‌ హీరోగా నటించిన ‘మిస్టర్‌ ప్రెగ్నెంట్‌’, ‘నచ్చినవాడు’ విడుదలవుతున్నాయి.


చివరి వారంలో సందడి వీటిదే..!

గస్టులో మెగా హీరోల సందడి కొనసాగనుంది.  వరుణ్‌ తేజ్‌ (Varun Tej) కథానాయకుడిగా నటిస్తోన్న సరికొత్త చిత్రం ‘గాంఢీవధారి అర్జున’ (Gandeevadhari Arjuna). సాక్షి వైద్య కథానాయిక. యాక్షన్‌, స్పై ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వం వహిస్తున్నారు. ఆగస్టు 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.  కార్తికేయ (Kartikeya) కథానాయకుడిగా నటించిన చిత్రం ‘బెదురులంక 2012’ (Bedurulanka 2012). నేహాశెట్టి (Neha Shetty) కథానాయిక. క్లాక్స్‌ దర్శకుడు. ఆగస్టు 25న ఈ సినిమా విడుదల కానుంది.

ఈనెల చివరి వారంలో మరో హిందీ సీక్వెల్‌ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఆగస్టు 25న ఆయుష్మాన్‌ ఖురానా హీరోగా నటించిన ‘డ్రీమ్‌గర్ల్‌ 2’ విడుదలవుతోంది. ఆయన ప్రధాన పాత్ర పోషించిన ‘డ్రీమ్‌గర్ల్‌’ చిత్రానికి ఇది సీక్వెల్‌. కామెడీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కరమ్‌వీర్‌సింగ్‌, పూజ అనే రెండు పాత్రల్లో ఆయుష్మాన్‌ వినోదం పంచనున్నారు. రాజ్‌ శాండిల్య దర్శకత్వంలో ఏక్తాకపూర్‌ నిర్మించారు. అనన్యాపాండే కథానాయిక.


ఓటీటీలో సందడి చేసేవి ఇవే!

  • జేడీ చక్రవర్తి నటించిన ‘దయా’ ఆగస్టు 4వ తేదీ నుంచి డిస్నీ+హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ కానుంది.
  • శోభిత ధూళిపాళ్ల, అర్జున్‌ మాథుర్‌ కీలక పాత్రల్లో నటించిన ‘మేడ్‌ ఇన్‌ హెవెన్‌’ సిరీస్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా ఆగస్టు 10 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.
  • గాల్‌ గాడోట్‌, అలియాభట్‌ ప్రధానపాత్రల్లో నటించిన హాలీవుడ్‌ చిత్రం ‘హార్ట్‌ ఆఫ్‌ ది స్టోన్‌’. ఈ స్పై యాక్షన్‌ చిత్రం తెలుగుతో సహా పలు భారతీయ భాషల్లో ఆగస్టు 11న నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది.
  • విపుల్‌ అమృతలాల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన హాట్‌స్టార్‌ స్పెషల్‌ ‘కమాండో’ ఆగస్టు 11వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది.
  • ‘ది ఫ్యామిలీమాన్‌’, ‘ఫర్జీ’ లాంటి వెబ్‌సిరీస్‌తో ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది రాజ్‌ అండ్‌ డీకే ద్వయం. ఈ దర్శకుల నుంచి వస్తున్న మరో ఆసక్తికర క్రైమ్‌ థ్రిల్లర్‌ సిరీస్‌ ‘గన్స్‌ అండ్‌ గులాబ్స్‌’. మలయాళ హీరో దుల్కర్‌ సల్మాన్‌, బాలీవుడ్‌ హీరో రాజ్‌కుమార్‌ రావు ప్రధాన పాత్రలు పోషించారు. ఆగస్టు 18 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానుంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని