Oorilo Vinayakudu Promo: నీకోసం ఏం మానేయ్యాలో చెప్పు. ఇప్పుడే మానేస్తా..
అలనాటి తారలు రోజా, ఇంద్రజ మధ్య సరదా మాటల యుద్ధం జరిగింది. వీరిద్దరూ టీమ్ లీడర్లుగా త్వరలో ఓ కార్యక్రమం ప్రేక్షకుల ముందుకు రానుంది. దానికి సంబంధించిన ప్రోమో తాజాగా బయటకు వచ్చింది...
అలనాటి నటీమణుల మధ్య మాటల యుద్ధం
హైదరాబాద్: అలనాటి తారలు రోజా, ఇంద్రజ మధ్య సరదా మాటల యుద్ధం జరిగింది. వీరిద్దరూ టీమ్ లీడర్లుగా త్వరలో ఓ కార్యక్రమం ప్రేక్షకుల ముందుకు రానుంది. దానికి సంబంధించిన ప్రోమో తాజాగా బయటకు వచ్చింది. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 10న ఈటీవీలో ‘ఊరిలో వినాయకుడు’ అనే కార్యక్రమం ప్రసారం కానుంది. సుధీర్, రష్మి వ్యాఖ్యాతలుగా జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ కమెడియన్లతోపాటు పలువురు సీరియల్ తారలు సైతం ఈ వేడుకలో సందడి చేయనున్నారు. తాజాగా విడుదలైన ప్రోమోలో ఈవెంట్‌కు సంబంధించిన కొన్ని విశేషాలు చూపించారు.
ఈవెంట్ ప్రారంభంలో డ్యాన్స్ చేసి మెప్పించిన సుధీర్-రష్మి.. పంచు డైలాగ్‌లతో ఆకట్టుకున్నారు. ‘పండగరోజు కూడా పాతమొగుడేనా?’ అని రష్మి ప్రశ్నించగా.. ‘నీకోసం ఏం మానేయ్యాలో చెప్పు. ఇప్పుడే మానేస్తా’ అంటూ సుధీర్ అడగడం.. దానికి ఆమె.. ‘యాంకరింగ్ మానేయ్.. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఈ యాంకరింగ్ చూడలేకపోతున్నాం’ అంటూ కౌంటర్లు వేసింది. అనంతరం జరిగిన వినాయక లడ్డూ వేలంపాటలో ఇంద్రజ, రోజా పోటీపడతారు. ‘రోజాగారు.. లడ్డూ వేలం పాడటమంటే ‘జబర్దస్త్’లో జడ్జిమెంట్ అనుకుంటున్నారా?’ అని ఇంద్రజ ప్రశ్నించగా.. ‘మీరు ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’లో జడ్జిమెంట్ అనుకుంటున్నారా?’ అని రోజా కౌంటర్ వేయడంతో అక్కడ ఉన్న వాళ్లందరూ సరదాగా నవ్వులు పూయించారు. అనంతరం రోజా.. ‘నన్ను చూసి ఏడవకురా!’ అంటూ కౌంటర్ ఇవ్వగానే.. ‘ఎక్కువగా మాట్లాడుతున్నారు. అతివేగం ప్రమాదకరం’ అని ఇంద్రజ సమాధానమిచ్చారు. మరోవైపు, ఈవెంట్‌లో భాగంగా ఇంద్రజ.. ‘నీ జీను ప్యాంటు చూసి’ సాంగ్ ఉర్రూతలూగించేలా స్టెప్పులేశారు. ఫన్నీ టాస్క్‌లో భాగంగా వర్ష.. యాచకురాలిగా మారి జనసంద్రంలో తిరుగుతూ.. కనిపించిన వాళ్లందరితో మాట్లాడానికి ప్రయత్నించారు. ఇలా ఎన్నో సరదా టాస్క్‌లతో వేడుకగా జరిగిన ‘ఊరిలో వినాయకుడు’ ఫుల్ ఈవెంట్ చూడాలంటే సెప్టెంబర్ 10 వరకూ వేచి ఉండాల్సిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Nara Lokesh: అప్పటివరకూ లోకేశ్‌ను అరెస్టు చేయొద్దు: సీఐడీకి హైకోర్టు ఆదేశం
-
Sky bus: స్కైబస్లో కేంద్రమంత్రి గడ్కరీ టెస్టు రైడ్.. త్వరలో ఆ బస్సులు భారత్‌కు!
-
DK Aruna: తెలంగాణ మోడల్ అంటే.. అవినీతి మోడల్: డీకే అరుణ
-
Stock Market: నష్టాల్లోనే మార్కెట్ సూచీలు.. 19,450 దిగువన స్థిరపడ్డ నిఫ్టీ
-
Ranbir Kapoor: రణ్‌బీర్ కపూర్‌కు ఈడీ సమన్లు
-
Union Cabinet: పసుపు బోర్డుకు కేంద్ర కేబినెట్ ఆమోదం.. సిలిండర్‌పై రాయితీ ₹300లకు పెంపు