Updated : 12 Sep 2021 11:02 IST

Prabhas: స్నేహితుడి విజయం.. సంతోషంలో ప్రభాస్‌

హైదరాబాద్‌: తన స్నేహితుడు గోపీచంద్‌ బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకున్నారని పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ అన్నారు. గోపీచంద్‌ కథానాయకుడిగా నటించిన ‘సీటీమార్‌’ సినిమా విజయంపై ప్రభాస్‌ తాజాగా స్పందించారు. ‘‘సీటీమార్‌’తో నా స్నేహితుడు బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని అందుకున్నాడు. నాకెంతో ఆనందంగా ఉంది. కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ తర్వాత ఫలితం గురించి కంగారులేకుండా ఇలాంటి పెద్ద చిత్రాన్ని థియేటర్లలోనే విడుదల చేయాలనే ఆలోచనతో ముందుకు వచ్చిన టీమ్‌ మొత్తానికి నా అభినందనలు’ అని ప్రభాస్ పేర్కొన్నారు.

మహిళా కబడ్డీ నేపథ్యంలో సాగే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘సీటీమార్‌’. సంపత్‌నంది దర్శకత్వం వహించారు. తమన్నా కథానాయిక. భూమిక, రావు రమేశ్‌, తణికెళ్ల భరణి కీలకపాత్రలు పోషించారు. ఇందులో గోపీచంద్‌ కబడ్డీ కోచ్‌ పాత్ర పోషించారు. మణిశర్మ స్వరాలు అందించారు. శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాస్‌ చిత్తూరి నిర్మించారు.


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని