
Published : 07 Dec 2021 12:31 IST
Sridevi Drama Company: రామ్‌చరణ్‌లా ఆది.. అల్లు అర్జున్‌లా రాంప్రసాద్!
ఇంటర్నెట్ డెస్క్: ‘ఈటీవీ’ వేదికగా ప్రతి ఆదివారం నవ్వులు పంచే కార్యక్రమం ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’. సుధీర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమానికి అతిథులుగా నటులు పృథ్వీ, అన్నపూర్ణ విచ్చేశారు. ‘నరేశ్ బారసాల వేడుక’లో భాగంగా వారిని అలరించేందుకు హైపర్ ఆది.. రామ్ చరణ్‌లా, రాంప్రసాద్.. అల్లు అర్జున్‌లా మారారు. ‘రంగస్థలం’ సినిమాలోని చిట్టిబాబు పాత్రలో ఆది, ‘పుష్ప’ చిత్రంలోని పుష్పరాజ్ పాత్రలో రాంప్రసాద్ నవ్వులు పంచారు. పృథ్వీ, అన్నపూర్ణ సైతం తమదైన శైలిలో కామెడీ పంచ్‌లు విసిరారు. డిసెంబరు 12 రజనీకాంత్ పుట్టినరోజును పురస్కరించుకొని ఇదే వేదికపై పలువురు కంటెస్టెంట్‌లు ఆయన పాటలకు అభినయించారు. జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
► Read latest Cinema News and Telugu News
ఇవీ చదవండి
Tags :