The Warriorr: ఆ సినిమా ఎఫెక్ట్‌ ‘ది వారియర్‌’లో రామ్‌పై పడింది..: పరుచూరి

రామ్ పోతినేని నటించిన ‘ది వారియర్‌’ సినిమాపై  ప్రముఖ రచయిత పరుచూరి గోపాల కృష్ణ పరుచూరి పాఠాల ద్వారా తనదైన శైలిలో విశ్లేషించి మాట్లాడారు.

Updated : 07 Oct 2022 18:46 IST

ఇంటర్నెట్ డెస్క్‌: యువ కథానాయకుడు రామ్‌ పోతినేని హీరోగా తమిళ దర్శకుడు లింగుస్వామి తెరకెక్కించిన చిత్రం ‘ది వారియర్‌’. ఈ సినిమా ఈ ఏడాది జులై 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పోలీస్‌ కథా నేపథ్యంతో విడుదలైన ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. తాజాగా ఈ సినిమాపై ప్రముఖ రచయిత పరుచూరి గోపాల కృష్ణ పరుచూరి పాఠాల ద్వారా తనదైన శైలిలో విశ్లేషించి మాట్లాడారు. ఈ సినిమాలోని బలాలు - బలహీనతలను ఇకపై రచయితలు కథలు రాసేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలను తెలియజేశారు.

ప్రాణం పోసే డాక్టర్‌ జీవితం నుంచి ఒక రౌడీ ప్రాణం తీసిన పోలీస్‌ ఆఫీసర్‌గా వచ్చిన ఈ సినిమా ఒకప్పటి ‘మానవుడు దానవుడు’, ‘సర్పయాగం’ లాంటి సినిమాల వంటిదని అన్నారు. అప్పట్లో ఆ రెండు సినిమాలు సూపర్‌ హిట్‌ అయ్యయని తెలిపారు. ఇక ఈ సినిమాలో రామ్‌ పాత్రపై గతంలో రామ్‌ చేసిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ పాత్ర ప్రభావం పడిందన్నారు. సామాన్యంగా రామ్‌ అనగానే ఓ లవ్‌ స్టోరీని ప్రేక్షకులు కోరుకుంటారని ఈ సినిమాలో రామ్‌కు కృతి శెట్టికి మధ్య ప్రేమ సన్నివేశాలు పెట్టడం కూడా సినిమాకు కలిసి వచ్చిందన్నారు. అయితే ఈ చిత్రంలో హీరో పాత్ర కంటే విలన్‌ (ఆది పినిశెట్టి పాత్ర)ని హైలైట్ చేశారన్నారు.

ఇక కొన్ని కొన్ని డైలాగ్‌లు బాగున్నాయని ప్రశంసించారు. ‘గురు అంటే వ్యక్తి కాదు జనం గొంతు మీద కత్తి’ లాంటి పవర్‌ఫుల్‌ డైలాగ్‌లను విలన్‌ పాత్రతో చెప్పించడం వల్ల ఆ పాత్ర హీరో పాత్రని డామినేట్‌ చేసిందని అన్నారు. ఇక ఈ సినిమాలో హీరో పోలీస్‌ కంప్లైంట్‌ విత్‌ డ్రా తీసుకునే సన్నివేశం మరోలా తీసి ఉంటే బాగుండేదన్నారు. క్లైమాక్స్‌లోనూ కొన్ని మార్పులు చేసి ఉంటే బాగుండేదనిపించిందన్నారు. మొత్తంగా చూస్తే రామ్‌ పోతినేని నటన అద్భుతంగా ఉందని ప్రశంసించారు. దర్శకుడు కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఈ సినిమా ఇంకా మంచి విజయం సాధించేదన్నారు.

ఇక రచయితలకు జాగ్రత్తలు చెబుతూ ఏ హీరోకి అయితే కథ రాస్తారో ఆ హీరోకి అప్పుడు ఉన్న ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకొని కథలను రాయాలని సలహా ఇచ్చారు.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని