LEO Movie: పోస్టర్‌లతోనే ‘లియో’ కథను హింట్‌ ఇచ్చారా? ఆ జాబితాలోనూ నెం.1

Leo Movie: విజయ్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘లియో’ మూవీకి సంబంధించి అప్‌డేట్స్‌ ఆసక్తిని కలిగిస్తున్నాయి.

Published : 21 Sep 2023 19:18 IST

హైదరాబాద్‌: విజయ్‌ (Vijay) కథానాయకుడిగా లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘లియో’ (Leo). ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబరు 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో వేర్వేరుగా పోస్టర్లను విడుదల చేసింది.

అంతేకాదు, ప్రతి పోస్టర్‌పై  ‘ప్రశాంతంగా ఉండు. యుద్ధాన్ని తప్పించు’, ‘ప్రశాంతంగా ఉండు.. యుద్ధానికి సిద్ధమవు’, ‘ప్రశాంతంగా ఉండు.. నీపై జరిగే కుట్ర నుంచి తప్పించుకో’, ‘ప్రశాంతంగా ఉండు. దుష్టశక్తిని ఎదుర్కో..’ అంటూ వేర్వేరు క్యాప్షన్లను ఇచ్చింది. ఈ పోస్టర్‌లను బట్టి చూస్తే, లోకేష్‌ కనగరాజ్‌ (Lokesh Kanagaraj) దీన్నొక రివెంజ్‌ డ్రామాగా తీర్చిదిద్దుతున్నారా? అన్న అనుమానం కలుగుతోంది. మరి అసలు కథను టీజర్‌, ట్రైలర్‌లో ఏమైనా చెబుతారా? లేక సినిమా చూస్తేనే తెలుస్తుందా? ఇంకేమైనా సర్‌ప్రైజ్‌లు ఇస్తారా? ఈ విషయాలన్నింటికీ సమాధానం లభించాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి. ఇక ఈ చిత్రంలో త్రిష (Trisha) కథానాయికగా నటిస్తోంది. సంజయ్‌దత్‌ (Sanjay Dutt) ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. అర్జున్‌, గౌతమ్‌ వాసుదేవ మేనన్‌, మిస్కిన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్‌ సంగీతం అందిస్తున్నారు.

ఐఎండీబీ జాబితా టాప్‌ లియో!

త్వరలో బాక్సాఫీస్‌ వద్ద ఆసక్తికర చిత్రాలు సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాయి. అత్యధిక మంది ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల జాబితాలో ‘లియో’ (Leo Movie) టాప్‌లో ఉంది. అందుకు సంబంధించిన సినిమాల జాబితాను మూవీ డేటా బేస్‌ పోర్టల్‌ ఐఎండీబీ పంచుకుంది. ‘లియో’ తర్వాత రామ్‌, బోయపాటి కాంబినేషన్‌లో వస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘స్కంద’ రెండులో ఉండగా, రాఘవ లారెన్స్‌, కంగనా రనౌత్‌ నటించిన ‘చంద్రముఖి2’ మూడో స్థానంలో నిలిచింది.

  • 1. లియో; విడుదల తేదీ: అక్టోబరు 19, 2023
  • 2. స్కంద: ది అటాకర్‌; విడుదల తేదీ: సెప్టెంబరు 28
  • 3. చంద్రముఖి2; విడుదల తేదీ: సెప్టెంబరు 28
  • 4.టైగర్‌3; విడుదల తేదీ: నవంబరు 10
  • 5. థ్యాంక్యూ ఫర్‌ కమింగ్‌; విడుదల తేదీ: అక్టోబరు 6
  • 6. ఫక్రీ; విడుదల తేదీ: సెప్టెంబరు 28
  • 7. మిషన్‌ రాణిగంజ్‌; విడుదల తేదీ: అక్టోబరు 6
  • 8.ది వ్యాక్సిన్‌ వార్‌; విడుదల తేదీ: సెప్టెంబరు 28
  • 9. సుఖీ; విడుదల తేదీ: సెప్టెంబరు 22
  • 10. గడ్డి జాందీ ఏ చెలాంగా మారిది; విడుదల తేదీ: సెప్టెంబరు 22

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని