స్టార్‌హీరో ఇంట్లోకి చొరబడి.. ఎనిమిది గంటలు మేకప్‌రూమ్‌లోనే దాక్కొని..

బాలీవుడ్‌ స్టార్‌ హీరో షారుఖ్‌ ఖాన్‌ (Shah Rukh Khan)ను చూసేందుకు ఇద్దరు యువకులు అత్యుత్సాహం కనబరిచారు. అక్రమంగా ఆయన నివాసంలోకి ప్రవేశించారు.

Updated : 09 Mar 2023 10:37 IST

ముంబయి: జీవితంలో ఒక్కసారైనా తమ అభిమాన హీరోని కలవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. అందుకోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. తమ కలను నెరవేర్చుకోవడం కోసం అడ్డుదారులు తొక్కి కొంతమంది చిక్కుల్లోపడతారు. తాజాగా ఇలాంటి ఘటనే బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌ (Shah Rukh Khan) ఇంట చోటు చేసుకుంది. షారుఖ్‌ను చూడాలనే ఆశతో ఇద్దరు యువకులు అత్యుత్సాహం కనబరిచి.. చివరికి పోలీస్‌ స్టేషన్‌ బాటపట్టారు. గతవారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలను తాజాగా ముంబయి పోలీసులు వెల్లడించారు.

గుజరాత్‌కు చెందిన 18ఏళ్ల సాహిల్ సలీం ఖాన్, అతడి స్నేహితుడు 19 ఏళ్ల రామ్‌ కుశువ.. షారుఖ్‌(Shah Rukh Khan)ని చూడాలని గతవారం మన్నత్‌ (షారుఖ్‌ ఖాన్‌ నివాసం)లోకి చొరబడ్డారు. భద్రతా సిబ్బంది కళ్లు గప్పి మార్చి 1వ తేదీ అర్ధరాత్రి బంగ్లాలోకి ప్రవేశించిన వీరు.. మూడో అంతస్తులో ఉన్న హీరో మేకప్‌ రూమ్‌లో సుమారు ఎనిమిది గంటలపాటు దాక్కొన్నారు. ఉదయాన్నే వీరిని చూసి షాకైన షారుఖ్‌ సిబ్బంది.. పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు అనంతరం వివరాలు వెల్లడించారు. భద్రతను కట్టుదిట్టం చేసుకోవాల్సిందిగా షారుఖ్‌కు సూచించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని