Telugu movies: కల్యాణ్‌రామ్ ట్రిపుల్ రోల్... టాలీవుడ్‌లో అలా నటించిన హీరోలెవరో తెలుసా?
ఇప్పటి వరకు తెలుగు సినిమాల్లో ఎందరో నటులు త్రిపాత్రాభినయంతో అలరించారు. తాజాగా కల్యాణ్ రామ్(Kalyan Ram) హీరోగా తెరకెక్కుతున్న ‘అమిగోస్’ (Amigos) చిత్రంలో ఈ హీరో ట్రిపుల్ రోల్(Triple role)లో నటించారు. ఈ నేపథ్యంలో గతంలో మూడు పాత్రల్లో నటించిన నటులు ఎవరో చూద్దాం.
అభిమాన హీరో తెరపై కనపడగానే విజిల్స్‌తో ఆడియన్స్ థియేటర్‌ను హోరెత్తిస్తారు. మరి ఆ హీరో త్రిపాత్రాభినయం చేస్తే.. మూడు పాత్రల్లో కనిపించి అలరిస్తే.. ట్రిపుల్ యాక్టింగ్‌తో డైలాగ్ డెలివరీ చేస్తుంటే.. ఇలా ఉంటే అభిమానులకు పండగే కదా.. తాజాగా కల్యాణ్‌రామ్(Kalyan Ram) నటిస్తోన్న ‘అమిగోస్’ (Amigos) చిత్రం టీజర్ విడుదలైన దగ్గరి నుంచి ప్రేక్షకులు త్రిపాత్రాభినయం గురించే మాట్లాడుకుంటున్నారు. రాజేంద్రరెడ్డి తెరకెక్కించిన ఈ సినిమా టీజర్ మంచి ప్రేక్షకాదరణ పొంది యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. ‘హరేరామ్’, ‘బింబిసార’ చిత్రాల్లో డ్యూయల్‌రోల్ చేసిన కల్యాణ్‌రామ్ ఇప్పుడు ‘అమిగోస్’ (Amigos)లో ఏకంగా మూడు పాత్రలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాడు. మరి ఇప్పటి వరకు తెలుగు సినిమాల్లో మూడు పాత్రల్లో నటించిన హీరోలు ఎవరు.. ఏ హీరో ఎన్నిసార్లు త్రిపాత్రాభినయం చేశారో చూసేద్దాం.
సీనియర్ ఎన్టీఆర్..
తెలుగు సినిమా చరిత్రలో అజరామరంగా నిలిచిపోయే పేరు నందమూరి తారక రామారావు(Nandamuri Taraka Rama Rao). ఎందరికో ఆరాధ్య నటుడు. తన డైలాగులతో, నటనతో సినిమాకు కొత్త అర్థాన్ని తెచ్చిన ఈ హీరో చాలా సినిమాల్లో త్రిపాత్రాభినయం చేశారు. వాటిలో ‘కులగౌరవం’, ‘శ్రీకృష్ణసత్య’, , ‘దానవీరశూరకర్ణ’, సినిమాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఇక ఈ మహానటుడు మూడు కంటే ఎక్కువ పాత్రల్లో అలరించిన సినిమాలు కూడా సినీ చరిత్రలో ఉన్నాయి.‘శ్రీమద్విరాట పర్వం’ ‘శ్రీమద్విరాట వీరబ్రహ్మేంద్ర చరిత్ర’ చిత్రాల్లో ఐదు పాత్రలు పోషించారు.
సూపర్ స్టార్ కృష్ణ
సూపర్ స్టార్ కృష్ణ(Krishna) తెరపై ఎన్నో ప్రయోగాలు చేశారు. తన అద్భుతమైన నటనతో ఎన్నో పాత్రలకు జీవం పోశారు. కౌబాయ్ పాత్రలకు పెట్టింది పేరుగా నిలిచిన ఈ హీరో ఏకంగా ఏడు సినిమాల్లో మూడు పాత్రలతో అలరించారు. ‘కుమార రాజా’, ‘పగపట్టిన సింహం’, ‘రక్త సంబంధం’, ‘బంగారు కాపురం’, ‘బొబ్బిలిదొర’, ‘డాక్టర్ సినీ యాక్టర్’, ‘సిరిపురం మొనగాడు’ ఈ సినిమాల్లో ఆయన నటనకు ఎన్నో అవార్డులు వరించాయి.
శోభన్ బాబు..
తెలుగుప్రేక్షకుల గుండెల్లో సోగ్గాడుగా గుర్తుండి పోయే నటుడు శోభన్ బాబు(Sobhan Babu). తన స్టైల్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చకున్న ఈ హీరో ఒక రీమేక్ సినిమాలో మూడు పాత్రలతో అలరించారు. తమిళంలో రజనీకాంత్ నటించిన ‘మూండ్రు ముగమ్’ సినిమాను 1983లో ‘ముగ్గురు మొనగాళ్లు’ పేరుతో రీమేక్ చేశారు. ఈ సినిమాలో ఆంధ్ర సోగ్గాడు శోభన్‌బాబు మూడు పాత్రలతో మెప్పించారు.
మెగాస్టార్ చిరంజీవి
చిరంజీవి(Chiranjeevi).. ఈ పేరుకే ప్రత్యేకమైన అభిమానులు ఉంటారనడంలో అతిశయోక్తిలేదు. తన డాన్స్‌లతో ప్రేక్షకులను ఊరూత్రలూగిస్తారు మెగాస్టార్. తన డైలాగ్ డెలివరీతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరో త్రిపాత్రాభినయంతో ప్రేక్షకులను అలరించారు. 1994లో విడుదలైన ‘ముగ్గురు మొనగాళ్లు’ సినిమాలో చిరంజీవి మూడు పాత్రల్లో నటించారు. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలోని పాటలు కూడా సూపర్ హిట్‌గా నిలిచాయి. ఇప్పటికీ సోషల్‌మీడియా రీల్స్‌లో ట్రెండింగ్‌లో ఉన్నాయి.
కమల్‌హాసన్
విలక్షణ నటుడు కమల్ హాసన్(Kamal Haasan) తన నటనతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నారు. ఈ నటుడు పాత్రకు న్యాయం చేయడం కోసం ఎంతటి కష్టమైన పడతారు. ఇక ఈ హీరో ‘విచిత్ర సోదరులు’ సినిమాలో మూడు పాత్రల్లో నటించి తన నటనతో ఔరా అనిపించారు. అలాగే ‘మైఖేల్ మదన కామ రాజు’లో నాలుగు పాత్రలతోనూ.. ‘దశావతారం’ సినిమాలో ఏకంగా పది పాత్రలతోనూ అలరించారు.
బాలకృష్ణ
నందమూరి బాలకృష్ణ(Balakrishna) తెరపై కనిపిస్తే అభిమానులకు పూనకాలు వస్తాయి. ఈ హీరో సినిమా ప్రకటించిన దగ్గరి నుంచి సినీ ప్రియులు ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఎదురుచూస్తుంటారు. ఈ నందమూరి హీరో పరుచూరి మురళి దర్శకత్వం వహించిన ‘అధినాయకుడు’ సినిమాలో మూడు పాత్రల్లో నటించారు. తాత, తండ్రి, మనవడు ఇలా మూడు తరాల పాత్రల్లోనూ తన నటనతో బాలకృష్ణ ఆకట్టుకున్నారు.
జూనియర్ ఎన్టీఆర్..
వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటూ సినిమాపై తనకున్న తపనను నిరూపించుకునే హీరో జూనియర్ ఎన్టీఆర్(Jr.NTR). తాతకు తగ్గ మనవడిగా డైలాగులతో ధియేటర్లలో విజిల్స్ వేయిస్తారు. ఈ హీరో కె.ఎస్ రవీంద్ర దర్శకత్వంలో వచ్చిన ‘జై లవకుశ’ సినిమాలో ట్రిపుల్ రోల్ చేసి మూడు పాత్రలకు ప్రాణం పోశారు. 2017లో ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్‌లో హిట్ అయిన సినిమాల సరసన నిలిచింది. ఈ చిత్రంలో తారక్‌తో రాశీ ఖన్నా, నివేదా థామస్ ఆడిపాడారు.
సూర్య..
‘సింగం’ సినిమాలతో టాలీవుడ్ భారీగా అభిమానులను సంపాదించుకున్నారు నటుడు సూర్య(Suriya). టైం ట్రావెల్ కాన్సెప్ట్‌తో ఈ హీరో అలరించిన సినిమా ‘24’. ఇందులో సూర్య మూడు విభిన్న పాత్రల్లో కనిపించి.. విజయాన్ని సొంతం చేసుకున్నారు.
విజయ్..
తమిళ హీరో అయినా.. తెలుగులోనూ తన సినిమాలతో సందడి చేస్తుంటాడు విజయ్(Vijay). ఈ హీరో నటించిన ‘మెర్సల్’ సినిమాను తెలుగులో ‘అదిరింది’ పేరుతో 2017లో విడుదల చేశారు. దీనికి అదిరిపోయే రెస్పాన్స్‌ను అందించారు ఆడియన్స్. ఈ సినిమాలో విజయ్ ట్రిపుల్ రోల్‌లో నటించిన సంగతి తెలిసిందే.
సంపూర్ణేష్ బాబు..
తన పంచ్‌లతో ప్రేక్షకులను బాగా నవ్విస్తుంటారు హీరో సంపూర్ణేష్ బాబు(Sampoornesh Babu). కొత్త కాన్సెప్ట్‌లతో సినీ ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తుంటాడు. ఇక ఈ హీరో ‘కొబ్బరి మట్ట’ సినిమాలో పాపారాయుడు, పెదరాయుడు, ఆండ్రాయుడుగా త్రిపాత్రాభినయంతో నవ్వించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Djokovic: అవమానపడ్డ చోటే.. మళ్లీ విజేతగా..
-
World News
H1b Visa: మార్చి 1 నుంచి హెచ్1బీ వీసా దరఖాస్తుల స్వీకరణ
-
Ap-top-news News
Tamilisai: బడ్జెట్‌కు ఇంకా ఆమోదం తెలపని గవర్నర్ తమిళిసై
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Politics News
Andhra News: జేసీ ప్రభాకర్‌రెడ్డి ముఖ్య అనుచరుడిపై హత్యాయత్నం
-
Ap-top-news News
Andhra News: ఇసుక కోసం.. నదిలోనే అడ్డంగా దారి