
Acharya: చిరంజీవి ‘ఆచార్య’ ఆసక్తికర పది విషయాలు మీకు తెలుసా?
ఇంటర్నెట్‌డెస్క్: చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ డ్రామా ‘ఆచార్య’ (Acharya). రామ్‌చరణ్ (Ram charan) కీలక పాత్ర పోషిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయిక. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సినిమా మొదలైన దగ్గరి నుంచి విడుదల వరకూ పది ఆసక్తికర విషయాలు మీకోసం...
- అక్టోబరు 8, 2019 విజయదశమి రోజు ‘చిరు 152’ వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా మొదలైంది. తొలిసారి కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్నారు. కరోనా కారణంగా మధ్యలో సినిమా ఆగిపోయింది. సినిమా మొదలైన రోజు నుంచి విడుదలవడానికి రెండు సంవత్సరాల ఆరునెలల సమయం పట్టింది.
- నిజ జీవితంలో తండ్రీ కొడుకులైన చిరంజీవి(Chiranjeevi)-రామ్‌చరణ్ కలిసి నటిస్తున్న పూర్తిస్థాయి చిత్రమిది. చిరు-నాగబాబుల తర్వాత మెగా ఫ్యామిలీ నుంచి ఇద్దరు నటులు కలిసి చేస్తున్న సినిమా ఇదే కావటం గమనార్హం. ఇందులో చిరంజీవి నక్సలైట్ నాయకుడిగా కనిపించనున్నారు. గతంలో ‘రక్త సింధూరం’(1985)లో చిరంజీవి నక్సలైట్ పాత్ర పోషించారు.
- ‘ఆచార్య’లో రామ్‌చరణ్ అతిథి పాత్ర పోషిస్తున్నారు. గతంలో చిరంజీవి నటించిన ‘ఖైదీ నంబర్ 150’ సాంగ్‌లో చరణ్ మెరిసిన సంగతి తెలిసిందే. ఇక అంతకుముందు చరణ్ నటించిన ‘మగధీర’, ‘బ్రూస్లీ’ చిత్రాల్లో చిరు తళుక్కున మెరిశారు.
- చిరంజీవి(Chiranjeevi)తో సినిమా చేయాలని కొరటాల శివ అనుకోలేదట. తొలుత రామ్‌చరణ్‌తో సినిమా చేద్దామనుకున్నారు కొరటాల. కథను కూడా వినిపించారు. అయితే ‘ఆర్‌ఆర్ఆర్’ కారణంగా ఆ సినిమా ఆలస్యమవడంతో చిరంజీవి కోరిక మేరకు ఈ సబ్జెక్ట్ సిద్ధం చేశారు. ఆ తర్వాత అనుకోకుండా సిద్ధ పాత్ర కోసం రామ్‌చరణ్ సినిమాలో భాగమయ్యారు.
- ‘ఆచార్య’ టైటిల్‌ను కూడా చిరంజీవే (Chiranjeevi)పొరపాటున లీక్ చేశారు. మార్చి 2020 ‘ఓ పిట్ట కథ’ ప్రచార కార్యక్రమానికి హాజరైన ఆయన కొరటాలతో చేస్తున్న సినిమా పేరు ‘ఆచార్య’అని చెప్పేశారు.
- తొలుత ఈ సినిమాలో కథానాయికగా త్రిషను అనుకున్నారు. ఆమె కూడా సినిమా చేసేందుకు సుముఖత వ్యక్తం చేశారు. కొన్ని రోజుల తర్వాత ఆమె ప్రాజెక్టు నుంచి బయటకు వచ్చారు. ఆ తర్వాత కాజల్‌ను కథానాయికగా తీసుకున్నారు. కొన్ని రోజులు షూట్ కూడా చేశారు. చివరకు కథ, ‘ఆచార్య’ పాత్ర ఔచిత్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ సన్నివేశాలను తొలగించారు.
- ‘ఆచార్య’సినిమా అత్యధిక భాగం ధర్మస్థలి ప్రాంతంలో జరుగుతుంది. ఇందుకోసం హైదరాబాద్‌లోని చిరంజీవి(Chiranjeevi)కి చెందిన 20 ఎకరాల స్థలంలో నాలుగు నెలల పాటు శ్రమించి ‘ధర్మస్థలి’ సెట్ వేశారు.
- స్టార్ హీరో మహేశ్‌బాబు ఈ సినిమాకు వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. గతంలో పవన్‌కల్యాణ్ నటించిన ‘జల్సా’ సినిమాకు మహేశ్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. అందులో కూడా పవన్‌కల్యాణ్ నక్సలైట్ పాత్రలో కనిపిస్తారు.
- ‘ఆచార్య’ సినిమా నిడివి 154 నిమిషాలు. రూ.140 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. సంగీత ఓ స్పెషల్ సాంగ్‌లో, రెజీనా ఐటమ్ సాంగ్‌లో తళుక్కున మెరవనున్నారు.
- తొలుత ఈ సినిమాను మే 13, 2021 విడుదల చేయాలని చిత్ర బృందం భావించింది. కరోనా కారణంగా వాయిదా పడింది. ఆ తర్వాత సంక్రాంతి రేసులోకి వచ్చినా, మరోసారి కరోనాతో విడుదల కాలేదు. మళ్లీ ఫిబ్రవరి 4, లేదా ఏప్రిల్ 1 2022న విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది. చివరకు ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (30-06-2022)
-
World News
Senegal: సమద్రంలో బోటు బోల్తా.. 13 మంది మృతి, 40మంది గల్లంతు!
-
India News
Udaipur Murder: ‘నన్ను చంపడానికి ప్లాన్.. రక్షించండి’.. హత్యకు ముందు పోలీసులకు దర్జీ ఫిర్యాదు!
-
India News
Jammu: జమ్మూలో మరో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
-
Sports News
Hanuma vihari : మన దగ్గర పోటీ ఎక్కువ.. ఏ స్థానంలోనైనా బ్యాటింగ్‌కు సిద్ధమే: హనుమ విహారి
-
Business News
బీచ్‌లో కాలక్షేపం కోసం ₹5 లక్షల కోట్ల కంపెనీకి సీఈఓ రాజీనామా!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Maharashtra crisis: మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా.. గవర్నర్ ఆమోదం
- Allu Arjun: ‘పుష్ప’తో మక్కల్ సెల్వన్ ఢీ.. లెక్కల మాస్టారి స్కెచ్ అదేనా?
- బీచ్‌లో కాలక్షేపం కోసం ₹5 లక్షల కోట్ల కంపెనీకి సీఈఓ రాజీనామా!
- Rajamouli: అలా చేస్తేనే థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతుంది: రాజమౌళి
- Udaipur Murder: ‘నన్ను చంపడానికి ప్లాన్.. రక్షించండి’.. హత్యకు ముందు పోలీసులకు దర్జీ ఫిర్యాదు!
- Shivani Rajasekhar: ‘మిస్ ఇండియా’ పోటీ నుంచి తప్పుకున్న శివానీ రాజశేఖర్.. కారణమిదే
- Mahesh babu: బిల్ గేట్స్‌తో మహేశ్‌బాబు.. పిక్ వైరల్.. ఎక్కడ కలిశారంటే?
- Karnataka: అప్పు తిరిగి చెల్లించలేదని.. అక్కాచెల్లెళ్లను వివస్త్రలను చేసి దాడి!
- Viral Video: గోల్డ్ స్మగ్లింగ్‌కు పాల్పడిన చీమలు.. ఏ కేసు పెట్టాలని నెటిజన్లకు అధికారి ప్రశ్న!
- Archana Shastry: అందుకే ‘మగధీర’లో నటించలేదు.. అర్చన కన్నీటి పర్యంతం