Trisha: అప్పుడే పెళ్లి..

దక్షిణాదిలో స్టార్‌ హీరోలందరితోనూ ఆడిపాడిన నాయిక త్రిష. ప్రస్తుతం ఎక్కువశాతం నాయికా ప్రాధాన్య చిత్రాలతో అలరిస్తోన్న ఈ నాయిక ఇటీవలే మణిరత్నం ‘పొన్నియిన్‌ సెల్వన్‌’లో రాజకుమారిగా నటించింది. తమిళనాట ఈ సినిమాకు మంచి ఆదరణ లభించింది.

Updated : 13 Oct 2022 06:57 IST

దక్షిణాదిలో స్టార్‌ హీరోలందరితోనూ ఆడిపాడిన నాయిక త్రిష (Trisha). ప్రస్తుతం ఎక్కువశాతం నాయికా ప్రాధాన్య చిత్రాలతో అలరిస్తోన్న ఈ నాయిక ఇటీవలే మణిరత్నం ‘పొన్నియిన్‌ సెల్వన్‌’లో (ponniyin selvan) రాజకుమారిగా నటించింది. తమిళనాట ఈ సినిమాకు మంచి ఆదరణ లభించింది. ఆమె చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టి రెండు దశాబ్దాలు పైనే అయ్యింది. ఆమె పెళ్లి భాజాలు ఎప్పుడు మోగుతాయో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదే విషయాన్ని ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో అడిగితే త్రిష స్పందించింది. ‘‘పెళ్లి ఎందుకు చేసుకోలేదు అంటే నా వద్ద సమాధానం లేదు. పెళ్లి ఎప్పుడు చేసుకుంటానో మాత్రం నాకే తెలియదు. నా మనసుకు నచ్చిన వ్యక్తి దొరికితే కచ్చితంగా చేసుకుంటాను. నన్ను పెళ్లి చేసుకోబోయేవాడు జీవితాంతం నాకు తోడు ఉంటాడనే నమ్మకం కలగాలి. అప్పుడే చేసుకుంటాను. పెళ్లి చేసుకొని విడాకులు తీసుకోవడం నాకు ఇష్టం లేదు. పెళ్లి చేసుకొని చాలామంది అసంతృప్తితో జీవిస్తున్నారు. అలాంటి పరిస్థితి నాకు ఎదురుకాకూడదు’’ అని చెప్పింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు