Unstoppable with NBK: మరోసారి ‘అన్‌స్టాపబుల్‌’.. చిరు వచ్చేనా?

బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే’ సరికొత్తగా ముస్తాబై అలరించేందుకు సిద్ధమవుతోంది.

Updated : 07 Oct 2023 21:37 IST

హైదరాబాద్‌: బాలకృష్ణ వ్యాఖ్యాతగా రూపొందిన ఎంటర్‌టైనింగ్‌ టాక్‌ షో ‘ఎన్‌బీకే విత్‌ అన్‌స్టాపబుల్‌’ (Unstoppable with NBK). ప్రముఖ తెలుగు ఓటీటీ ‘ఆహా’ వేదికగా స్ట్రీమింగ్‌ స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ టాక్‌ షో రెండు సీజన్లు పూర్తి చేసుకుంది. ఇప్పుడు మరోసారి సరికొత్తగా ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. ‘అన్‌స్టాపబుల్‌ లిమిటెడ్‌ ఎడిషన్‌’ పేరుతో బాలకృష్ణ మరోసారి సందడి చేయనున్నారు. గత సీజన్స్‌తో పోలిస్తే, ఈసారి షో మరింత కొత్తగా తీర్చిదిద్దుతున్నట్లు టాక్‌. అంతేకాదు, ఈ లిమిటెడ్‌ ఎడిషన్‌లో స్టార్‌ హీరోలు అతిథులుగా రానున్నారని టాక్‌. ఈ షోకు చిరంజీవి వస్తే, చూడాలని ఎంతో మంది అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. మరి అది సాకారం అవుతుందా?లేదా? అన్నది తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని