Upasana: కియారాకు సారీ చెప్పిన ఉపాసన
బాలీవుడ్ నటి కియారా అడ్వాణీ (Kiara Advani), నటుడు సిద్ధార్థ్ మల్హోత్ర (Sidharth Malhotra) వివాహం మంగళవారం ఉదయం రాజస్థాన్‌లో వేడుకగా జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను కియారా ఇన్‌స్టా వేదికగా షేర్ చేశారు.
హైదరాబాద్: బాలీవుడ్ నటి కియారా అడ్వాణీ (Kiara Advani)కి రామ్‌చరణ్ (Ram Charan) సతీమణి ఉపాసన (Upasana) క్షమాపణలు చెప్పారు. వీలు కుదరకపోవడం వల్లే పెళ్లికి హాజరు కాలేకపోయామని అన్నారు. ఈ మేరకు కియారా తన పెళ్లి ఫొటోలను ఇన్‌స్టా వేదికగా షేర్ చేయగా.. ‘‘కంగ్రాట్స్ కియారా. మీ జోడీ చూడచక్కగా ఉంది. పెళ్లికి మేము హాజరు కాలేకపోయినందుకు సారీ. మీ ఇద్దరికీ మరోసారి నా అభినందనలు’’ అని ఉపాసన కామెంట్ చేశారు. ‘వినయ విధేయ రామ’తో రామ్‌చరణ్ - కియారా మంచి స్నేహితులయ్యారు. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి #RC 15 కోసం పనిచేస్తున్నారు. ఈక్రమంలోనే కియారా అడ్వాణీ - సిద్ధార్థ్ మల్హోత్రల వివాహ ఆహ్వాన పత్రిక రామ్‌చరణ్ దంపతులకు అందింది. సినిమా షూటింగ్‌తో బిజీగా ఉండటం వల్ల చరణ్ దంపతులు ఈ పెళ్లి వేడుకలో పాల్గొనలేకపోయారు.
నూతన జంటకు శుభాకాంక్షల వెల్లువ...
మరోవైపు, బాలీవుడ్ సెలబ్రిటీలు నూతన జంటకు శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు పెడుతున్నారు. నిర్మాత కరణ్ జోహార్ (Karan Johar) తాజాగా ఇన్‌స్టా వేదికగా ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ‘‘పదిన్నరేళ్ల క్రితం సిద్ధార్థ్ (Sidharth Malhotra)ను కలిశాను. తనెంతో సైలెంట్, స్ట్రాంగ్, సున్నితమైనవాడు. అతడిని కలిసిన కొన్నేళ్ల తర్వాత కియారాతో నాకు పరిచయమైంది. సిద్ధార్థ్‌లో ఎలాంటి లక్షణాలు చూశానో కియారా కూడా అలాగే ఉంటుంది. కొంతకాలానికి వీరిద్దరూ కలిశారు. బలమైన ఈ ఇద్దరు వ్యక్తులు కలిసి.. ఒక అద్భుతమైన ప్రేమకథను సృష్టించగలరని నేను ఆ రోజే అనుకున్నాను. వీరిద్దరూ వివాహబంధంతో ఒక్కటైన ఈ క్షణాలను చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది. మీరిద్దరూ శాశ్వతంగా ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను’’ అని కరణ్ పేర్కొన్నారు. రామ్‌చరణ్, అలియాభట్, వరుణ్ ధావన్, తమన్నా, రష్మిక, సమంత, విక్కీ కౌశల్‌తోపాటు పలువురు నటీనటులు కంగ్రాట్స్ అంటూ విషెస్ చెప్పారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ts-top-news News
ఉదయం ప్రజాప్రతినిధి.. మధ్యాహ్నం కూలీ
-
Sports News
ధోని కెప్టెన్సీ పేలవం: టీమ్ఇండియా మాజీ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్
-
Movies News
భయపెట్టేందుకు బరిలోకి ఎన్టీఆర్
-
World News
Saeed Rashed: నాలుగేళ్ల కుర్రాడు.. రికార్డు సృష్టించాడు
-
World News
US Man: అతడికి డబ్బు ఖర్చుపెట్టడమంటే అలర్జీ అట..!
-
World News
UNSC: రష్యా చేతికి యూఎన్ఎస్సీ పగ్గాలు.. ‘చెత్త జోక్’గా పేర్కొన్న ఉక్రెయిన్!