Upasana: ‘ఈ సంవత్సరం నా భర్తదే’.. రామ్ చరణ్‌పై ఉపాసన ఆసక్తికర కామెంట్స్
ఈ ఏడాది తానెంతో ఆనందంగా ఉన్నానని రామ్ చరణ్ (Ram Charan) భార్య ఉపాసన (Upasana) తెలిపింది. రామ్ చరణ్ సాధిస్తోన్న విజయాలపై ఆమె మాట్లాడింది.
హైదరాబాద్: రామ్ చరణ్ (Ram Charan) సతీమణి ఉపాసన (Upasana Konidela) మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో తెలిసిందే. సామాజిక కార్యక్రమాలతో పాటు సినిమాలకు సంబంధించిన అన్ని ప్రోగ్రామ్స్‌లోనూ చురుగ్గా పాల్గొంటుంది. సినిమా ప్రమోషన్స్ నుంచి ప్రెస్మీట్స్ వరకూ ప్రతిచోటా చరణ్‌కు వెన్నంటే ఉంటుంది. ‘ఆర్ఆర్ఆర్’ (RRR) టీంతో పాటు ఈ మెగా కోడలు కూడా ఎన్నో సందర్భాల్లో విదేశాల్లో సందడి చేసింది. తాజాగా ఓ ప్రముఖ మీడియాతో మాట్లాడిన ఉపాసన తన భర్త రామ్ చరణ్ సాధిస్తున్న విజయాల గురించి మాట్లాడింది.
‘‘నా జీవితంలో జరిగే ప్రతి సంఘటనలో రామ్ చరణ్ నాకు మద్దతుగా నిలిచాడు. అలాగే నేను చెర్రీకి అన్ని విషయాల్లో సపోర్ట్‌గా ఉంటాను. ‘నాటు నాటు’ షూటింగ్ కోసం ఉక్రెయిన్ వెళ్లినప్పుడైనా.. ఇంట్లో ఉన్న సమయంలోనైనా.. అలాగే షూటింగ్‌లతో బిజీగా గడుపుతున్నప్పుడైనా.. ఇలా ప్రతి విషయంలోనూ నేను చెర్రీకి వెన్నంటే ఉన్నాను. ఎలాంటి సందర్భంలోనైనా తనకు నేను శాయశక్తుల సాయం చేస్తుంటాను. ఇక చరణ్‌కు ఈ ఏడాది ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. తన వర్క్‌పరంగా కూడా ఎంతో సంతృప్తిగా ఉన్నాడు. ఈ సంవత్సరం చరణ్ ఎన్నోప్రశంసలను అందుకున్నాడు. ఈ ఏడాది తనదే’’ అని చెప్పింది.
ఇక ‘ఆర్ఆర్ఆర్’లోని నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చినప్పుడు కూడా ఉపాసన.. చరణ్‌తో కలిసి సందడి చేశారు. కాలిఫోర్నియాలోని ది బెవర్లీ హిల్టన్ హాల్ వేదికగా జరిగిన ఆ అవార్డుల ప్రదానోత్సవంలో ‘ఆర్ఆర్ఆర్’ టీంతో పాటు ఉపాసన కూడా పాల్గొంది. ఆ వీడియోలు నెట్టింట సందడి చేశాయి. ప్రస్తుతం రామ్ చరణ్ అమెరికాలో ఉన్నాడు. అక్కడ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా రీ రిలీజ్ అయిన సందర్భంగా ఆడియన్స్‌తో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Delhi: కొవిడ్ కేసుల పెరుగుదలపై ఆందోళన వద్దు: సీఎం కేజ్రీవాల్
-
World News
North Korea: కిమ్ రాజ్యంలో దారుణాలు.. గర్భిణులు, స్వలింగ సంపర్కులకు ఉరిశిక్షలు
-
General News
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో.. రద్దీ వేళల్లో రాయితీ రద్దు
-
Sports News
CSK: అత్యుత్తమ ఆల్‌రౌండర్.. ఈ స్టార్‌కు మరెవరూ సాటిరారు: హర్భజన్ సింగ్
-
Movies News
Sai Pallavi: అలా కనిపిస్తాను కాబట్టే నన్ను ఎక్కువ మంది ఇష్టపడతారు: సాయి పల్లవి
-
World News
Donald Trump: పోర్న్ స్టార్ కేసులో అభియోగాలు.. ట్రంప్ భవితవ్యమేంటి?