Telugu Movies: ఉగాది స్పెషల్.. ఈ వారం థియేటర్/ఓటీటీలో వచ్చే చిత్రాలివే!
ఉగాది సందర్భంగా అటు థియేటర్, ఇటు ఓటీటీల్లో విడుదలకానున్న సినిమాలేంటో చూసేయండి...
ఇంటర్నెట్ డెస్క్: గతవారం, అంతకుముందు వారం విడుదలైన సినిమాలు థియేటర్లలో సందడి చేస్తూనే ఉన్నాయి. మరోవైపు, ‘ఉగాది’ని పురస్కరించుకుని పలు చిత్రాలు ఈ బుధవారం ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమయ్యాయి. కొన్ని థియేటర్ల వేదికగా.. కొన్ని ఓటీటీ వేదికగా అలరించనున్నాయి. అవేంటంటే?
ధమ్కీ ఇచ్చేందుకు..
‘పాగల్’ తర్వాత విశ్వక్‌సేన్ (Vishwak Sen), నివేదా పేతురాజ్ కలిసి నటించిన చిత్రం ‘దాస్ కా ధమ్కీ’ (Das Ka Dhamki). విశ్వక్‌సేనే ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. యాక్షన్- కామెడీ తరహాలో రూపొందింది.
రంగస్థల కళాకారుల జీవితం..
రంగస్థల కళాకారుల జీవితాన్ని ‘రంగమార్తాండ’ (Rangamarthanda)తో తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు దర్శకుడు కృష్ణవంశీ. మరాఠీ హిట్ చిత్రం ‘నట్‌సామ్రాట్’కు రీమేక్‌గా దాన్ని రూపొందించారాయన. ప్రకాశ్‌రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ, రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక రాజశేఖర్ తదితరులు నటించారు.
భయపెడుతూ నవ్వించేందుకు
కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) ప్రధాన పాత్రధారిగా దర్శకుడు కల్యాణ్ తెరకెక్కించిన తమిళ చిత్రం ‘ఘోస్టి’. తెలుగులో ‘కోస్టి’ పేరుతో రిలీజ్ అవుతోంది. హారర్ కామెడీ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో యోగిబాబు, ఊర్వశి తదితరులు కీలక పాత్రలు పోషించారు.
థియేటర్లలో.. మరికొన్ని
* గీతసాక్షిగా (మార్చి 22)
ఓటీటీల్లో సందడి చేసేందుకు..
ఈటీవీ విన్
* పంచతంత్రం
ఆహా
* వినరో భాగ్యము విష్ణుకథ
నెట్‌ఫ్లిక్స్
* అమెరికన్ అపోకలిప్స్ (ఇంగ్లిష్)
* జానీ (ఇంగ్లిష్) (మార్చి 23)
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Salaar: ‘సలార్’ రిలీజ్ ఆరోజేనా?.. వైరల్‌గా ప్రశాంత్ నీల్ వైఫ్ పోస్ట్
-
IND vs AUS: భారత్‌ను ఓడించిన జట్టు ప్రపంచకప్ గెలుస్తుంది: మైఖేల్ వాన్
-
Prabhas Statue: ప్రభాస్ ‘బాహుబలి’ మైనపు విగ్రహం.. నిర్మాత ఆగ్రహం..!
-
Interpol: ఖలిస్థాన్ ఉగ్రవాది కరణ్‌వీర్‌సింగ్ కోసం ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్ నోటీస్
-
Social Look: చీరలో పూజా మెరుపులు.. రకుల్ పోజులు.. దివి కవిత్వం ఎవరికోసమో తెలుసా..?
-
Black Sea: రష్యాకు ఎదురుదెబ్బ.. నౌకాదళ కమాండర్ సహా 34 మంది మృతి!