Keerthy Suresh: వరుణ్‌ ప్రియురాలిగా..

‘నేను..శైలజ...’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కీర్తి సురేష్‌ ప్రస్తుతం టాలీవుడ్‌లోని అగ్రకథానాయకులతో కలిసి నటిస్తూ మంచి క్రేజ్‌ను సొంతం చేసుకుంటుంది.

Updated : 29 Jul 2023 14:35 IST

‘నేను..శైలజ...’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కీర్తి సురేష్‌ ప్రస్తుతం టాలీవుడ్‌లోని అగ్రకథానాయకులతో కలిసి నటిస్తూ మంచి క్రేజ్‌ను సొంతం చేసుకుంటుంది. తెలుగు, తమిళ, మలయాళ చిత్రాలలోనే కాకుండా ఇప్పుడు హిందీలో కూడా అడుగు పెడుతోంది. వరుణ్‌ ధావన్‌ హీరోగా దర్శకుడు కాలీస్‌ తెరకెక్తిస్తున్న ఓ సినిమాలో కీర్తి నటించనుంది. అట్లీ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని అట్లీ భార్య ప్రియ, మురద్‌ ఖేతని నిర్మిసున్నారు. టైటిల్‌ ఖరారు చేయని ఈ సినిమాలో వరుణ్‌ పోలీసు ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఆయన ప్రియురాలిగా కీర్తి అలరించనుంది. ప్రేమ, వినోదం, యాక్షన్‌ సన్నివేశాలతో అభిమానుల ముందుకు రానున్న ఈ సినిమా చిత్రీకరణ ఆగస్టులో ప్రారంభం కానునట్లు సినీవర్గాలు తెలిపాయి. నవంబరు వరకు నిర్మాణ పనులను పూర్తి చేసుకొని వచ్చే ఏడాది మేలో విడుదల చేయటానికి మేకర్స్‌ ఈ సినిమాను రూపొందిస్తున్నారని సన్నిహిత వర్గాలు తెలిపాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని