F3 Trailer: ఎఫ్‌-3 ట్రైలర్‌.. ఫన్‌+ఫ్రస్ట్రేషన్‌ అన్నీ డబుల్‌ డోసులే..!!

ఎఫ్‌3 ట్రైలర్‌ వచ్చేసింది..

Updated : 09 May 2022 10:42 IST

హైదరాబాద్‌: ‘‘వాళ్లది మరాఠీ ఫ్యామిలీ అయితే మాది దగ్గుబాటి ఫ్యామిలీ’’, ‘‘వాళ్లది దగా ఫ్యామిలీ అయితే మాది మెగా ఫ్యామిలీ’’ అంటున్నారు మన ఫ్రస్ట్రేటెడ్‌ తోడల్లుళ్లు వెంకటేశ్‌, వరుణ్‌ తేజ్‌. వాళ్లిద్దరూ ప్రధాన పాత్రలో నటించి, నవ్వులు పూయించిన చిత్రం ‘ఎఫ్‌-2’. 2019 సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద నవ్వుల సునామీ సృష్టించింది. ఇప్పుడిదే చిత్రానికి సీక్వెల్‌గా ‘ఎఫ్‌-3’ సిద్ధమైన సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకుడు. వేసవి కానుకగా మే 27న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో సోమవారం ఉదయం ‘ఎఫ్‌-3’ ట్రైలర్‌ని చిత్రబృందం విడుదల చేసింది. ట్రైలర్‌లోని సన్నివేశాలు, నటీనటుల డైలాగ్స్‌ చూస్తే ‘ఎఫ్‌-2’తో పోలిస్తే ‘ఎఫ్‌-3’లో ఫన్‌ డోస్‌ మరింత పెరిగినట్లు అర్థమవుతోంది. ‘ఎఫ్‌-2’లో సంసారం అనే కాన్సెప్ట్‌ చుట్టూ తిరిగిన ఈ చిత్రం ఇప్పుడు డబ్బు చుట్టూ తిరిగింది.

‘‘ప్రపంచానికి తెలిసిన పంచభూతాలు అయిదే. కానీ ఆరో భూతం ఒకటి ఉంది. అదే డబ్బు’’ అంటూ మురళీశర్మ చెప్పే డైలాగ్‌లతో ప్రారంభమైన ట్రైలర్‌ ఆద్యంతం నవ్వులు పూయించేలా సాగింది. ఓ వైపు రేచీకటి వ్యక్తిగా వెంకీ.. నత్తి ఉన్న వ్యక్తిగా వరుణ్‌ ఇచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్‌ పీక్స్‌లో ఉంది. ఇక, డబ్బు కోసం వాళ్లు పడే పాట్లు, తమన్నా, మెహ్రీన్‌ అండ్‌ ఫ్యామిలీ చేసే పనులు.. దానికి మన హీరోలు ఇచ్చే రియాక్షన్ ఈలలు వేయించేలా ఉన్నాయి. ట్రైలర్‌ చివర్లో  ‘అంతేగా అంతేగా’ డైలాగ్‌ మరింత నవ్వులు పూయించేలా ఉంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని