Leo: విజయ్‌ ‘లియో’.. అక్కడ ‘జీరో కట్స్‌’తో విడుదల

విజయ్‌ హీరోగా నటించిన ‘లియో’ సినిమా విడుదలకు సంబంధించిన అప్‌డేట్‌ ఆసక్తికరంగా మారింది. అదేంటంటే?

Published : 13 Sep 2023 18:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విజయ్‌ (Vijay) హీరోగా దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ (Lokesh Kanagaraj) తెరకెక్కిస్తున్న చిత్రం ‘లియో’ (Leo). ఈ సినిమా రా వెర్షన్‌ (అన్‌కట్‌ వెర్షన్‌)ను యూకేలో విడుదల చేస్తున్నట్లు పంపిణీ సంస్థ అహింసా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది. దర్శకుడు లోకేశ్‌ విజన్‌ను దృష్టిలో పెట్టుకుని, ఒక్క విజువల్‌ కూడా ప్రేక్షకులు మిస్‌కాకుడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. తాము ఊహించిన స్థాయిలో సినిమాకి స్పందన వచ్చిన తర్వాత 12A (12 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసు కలిగిన వారు) ఫ్రెండ్లీ వెర్షన్‌ రిలీజ్‌ చేస్తామని పేర్కొంది. విడుదలకు నెలపైనే సమయం ఉన్నా.. ఇప్పటికే అక్కడ అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ఓపెన్‌కాగా 24 గంటల్లోనే 10వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోవడం విశేషం.

అతడితో వర్క్‌ చేయడం ఎప్పటికీ జరగదు: విశాల్‌ ఆగ్రహం

భారత్‌లో ‘జీరో కట్స్‌’ వెర్షన్‌ విడుదలవడం కష్టమే అనేది సినీ విశ్లేషకుల మాట. ఈ సినిమాలోని ఫస్ట్‌ సాంగ్‌ ‘నా రెడీ’ (Naa Ready) సెన్సార్‌కు చేరగా సభ్యులు కొన్ని మార్పులు సూచించారు. 4 నిమిషాల 17 సెకన్లు నిడివి ఉన్న ఈ పాటలో మద్యపానానికి సంబంధించిన లిరిక్స్‌ను తొలగించి.. ఆ స్థానంలో కొత్త పదాలు చేర్చాలని, హీరో సిగరెట్‌ కాలుస్తూ ఉన్న క్లోజప్‌ షాట్స్‌ నిడివి తగ్గించాలని, ‘ధూమపానం ఆరోగ్యానికి హానికరం’ అనే ఫాంట్‌ సైజ్‌ను పెంచాలని సెన్సార్‌ సభ్యులు చిత్ర బృందానికి సూచించారు.

‘విక్రమ్‌’లాంటి సూపర్‌హిట్‌ తర్వాత లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రంకావడం, ‘మాస్టర్‌’ తర్వాత లోకేశ్‌- విజయ్‌ కాంబోలో రూపొందుతున్న సినిమాకావడంతో ‘లియో’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాలో త్రిష కథానాయిక. సంజయ్‌ దత్‌, అర్జున్‌, గౌతమ్‌ వాసుదేవ్‌ మేనన్‌, మిస్కిన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అక్టోబరు 19న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని