Mahaan: ‘బార్‌ లీజ్‌.. సిండికేట్‌ మనిషై ఉండాలి’

‘‘ఈరోజు ఈ రాష్ట్రంలో ఎవరు బార్‌ లీజ్‌ తీసుకున్నా.. అతను తప్పకుండా మన సిండికేట్‌ మనిషై ఉండాలి. మనం పెట్టిందే చట్టం. మనం పోసేదే మద్యం’’ అని అంటున్నారు నటుడు విక్రమ్‌. ఆయన ప్రధాన పాత్రలో..

Published : 31 Jan 2022 14:19 IST

చెన్నై: ‘‘ఈరోజు ఈ రాష్ట్రంలో ఎవరు బార్‌ లీజ్‌ తీసుకున్నా.. అతను తప్పకుండా మన సిండికేట్‌ మనిషై ఉండాలి. మనం పెట్టిందే చట్టం. మనం పోసేదే మద్యం’’ అని అంటున్నారు నటుడు విక్రమ్‌. ఆయన ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘మహాన్‌’. కార్తిక్‌ సుబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 10న అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం మొదటిసారి విక్రమ్‌ ఆయన తనయుడు ధ్రువ్‌ స్క్రీన్‌ షేర్ చేసుకున్నారు. తాజాగా ‘మహాన్‌’ ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. మద్యాన్ని నిషేధించాలంటూ కొంతమంది వ్యక్తులు చేసే ఉద్యమ సన్నివేశాలతో ప్రారంభమైన ఈ టీజర్‌ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. మద్యం, ఇతర అసాంఘిక కార్యక్రమాలకు వ్యతిరేకంగా ఒక మహాత్ముడిలా జీవిస్తానంటూ చిన్నప్పుడే తండ్రికి మాటిచ్చిన హీరో.. పెద్దయ్యాక ఆ మాటను నిలబెట్టుకున్నాడా? సమాజంలో అతన్ని ప్రభావితం చేసిన అంశాలేమిటి? ఇలాంటి ఎన్నో ఆసక్తికర విషయాలతో ఈ చిత్రం రూపుదిద్దుకుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని