Vikram: ‘విక్రమ్‌’ వచ్చేస్తున్నాడు.. మేకింగ్‌ మామూలుగా లేదు!

విక్రమ్‌ మేకింగ్‌ చూశారా..?

Published : 14 Mar 2022 08:28 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అగ్రకథానాయకుడు కమల్‌హాసన్‌ కీలకపాత్రలో నటిస్తోన్న చిత్రం ‘విక్రమ్‌’. బిగ్గెస్ట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి ‘ఖైదీ’ ఫేమ్‌ లోకేశ్‌ కనగరాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదల తేదీని సోమవారం ఉదయం చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. వేసవి కానుకగా జూన్‌ 3న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. విడుదల తేదీతోపాటు ‘విక్రమ్‌’ మేకింగ్‌ వీడియోను అభిమానులతో మూవీ టీమ్‌ పంచుకుంది. యాక్షన్‌ సన్నివేశాల చిత్రీకరణకు సంబంధించిన గ్లింప్స్‌ని ఇందులో చూపించారు. పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా సాగే ఈ సినిమాలో విజయ్‌ సేతుపతి, మలయాళీ నటుడు ఫహద్‌ ఫాజిల్‌ కీ రోల్స్‌లో కనిపించనున్నారు. అనిరుధ్‌ స్వరాలు అందిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే విడుదల చేసిన పలు ప్రచార చిత్రాలు ‘విక్రమ్‌’పై ఆసక్తిని రేకెత్తించాయి. చాలా రోజుల తర్వాత కమల్‌హాసన్‌ పవర్‌ఫుల్‌ రోల్‌ కనిపించనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని