Chiranjeevi: చిరుపై అభిమానం.. స్టెప్పులతో ఈలలు వేయిస్తున్న అంకుల్స్‌

మెగాస్టార్‌ చిరంజీవి డ్యాన్స్‌కు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్‌ ఉంది. నటుడిగా చిరంజీవి కెరీర్‌ ప్రారంభమైన కొత్తలో డ్యాన్సే ఆయన్ని మాస్‌ ప్రేక్షకులకు మరింత చేరువ చేసింది....

Published : 10 Jan 2022 14:54 IST

హైదరాబాద్‌: మెగాస్టార్‌ చిరంజీవి డ్యాన్స్‌కు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్‌ ఉంది. నటుడిగా చిరంజీవి కెరీర్‌ ప్రారంభమైన కొత్తలో డ్యాన్సే ఆయన్ని మాస్‌ ప్రేక్షకులకు మరింత చేరువ చేసింది. ఇక 1980, 90ల్లో ఆయన నటించిన చిత్రాల్లో ఎన్నో సూపర్‌హిట్‌ డ్యాన్స్‌ నంబర్స్‌ ఉన్నాయి. వాటిల్లో ‘బావగారు బాగున్నారా’, ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’, ‘హిట్లర్‌’, ‘ఇద్దరు మిత్రులు’, ‘స్నేహం కోసం’ వంటి సినిమాల్లోని పాటలకు ఇప్పటికీ సినీ ప్రియుల్లో మాంచి ఫాలోయింగ్‌ ఉంది. ఈ క్రమంలోనే ఇటీవల ఇద్దరు అంకుల్స్‌ మెగాస్టార్‌ పాటలకు తమదైన శైలిలో స్టెప్పులేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇంటి వద్ద జరిగిన వేడుకలో ఓ వ్యక్తి.. ‘‘ఆంటీ కూతురా’’ పాటకు సూపర్‌ స్టెప్పులేసి ఆకట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. అది చూసిన దర్శకుడు, ‘కలర్‌ఫొటో’ కథా రచయిత సాయి రాజేశ్‌ ట్విటర్‌ వేదికగా ఆ వీడియోని షేర్‌ చేస్తూ.. ‘‘1980, 90ల్లో అభిమానం వేరే లెవల్‌’’ అని కామెంట్‌ చేశారు. ఇదిలా ఉండగా మరో పెద్దాయన..  ‘‘అబ్బనీ తియ్యనీ దెబ్బ’’ పాటకు తాజాగా కవర్‌ సాంగ్‌ చేసి యూట్యూబ్‌లో షేర్‌ చేయగా.. పెద్దాయన ప్రయత్నాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. ఆయా వీడియోలు చూసిన నెటిజన్లు.. ‘‘అభిమానానికి వయసుతో సంబంధం లేద‌’’ని కామెంట్లు చేస్తున్నారు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని