Vishal: విశాల్‌ ఛాతీపై మాజీ సీఎం టాటూ.. ఫొటో వైరల్‌!

విశాల్‌ ఫొటో ఒకటి నెట్టింట ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. అందులో ఆయన ఛాతీపై టాటూ కనిపించింది. అది ఎవరి రూపం అంటే?

Updated : 24 Jan 2023 17:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నటుడు విశాల్‌ (Vishal) ఛాతీపై పచ్చ బొట్టు పొడిపించుకున్నారు. సంబంధిత ఫొటో నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ టాటూ బొమ్మ ఎవరిదో కాదు కోలీవుడ్‌ ప్రముఖ నటుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎంజీఆర్‌ (ఎంజీ రామచంద్రన్‌)ది. ఎంజీఆర్‌ (MG Ramachandran) నటనకు, నాయకత్వానికి విశాల్‌ పెద్ద అభిమాని అని, అందుకే ఇలా చేశారని కోలీవుడ్‌ వర్గాల్లో వినిపిస్తోంది. మరోవైపు, ‘అది పర్మినెంట్‌ టాటూ కాదేమో? ఏదైనా సినిమాలోని పాత్ర కోసం అది ప్రయత్నించారేమో’ అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనా తాజా ఫొటోలో విశాల్‌ హెయిర్‌ కటింగ్‌, క్లీన్‌ షేవ్‌తో చాలా కొత్తగా కనిపించారు.

గతేడాది ‘సామాన్యుడు’, ‘లాఠీ’ చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన విశాల్‌ ప్రస్తుతం ‘మార్క్‌ ఆంటోని’ అనే సినిమాలో నటిస్తున్నారు. అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న ఆ సినిమాలో రీతూవర్మ కథానాయిక. ఆ చిత్రం పూర్తయిన తర్వాత విశాల్‌ ‘డిటెక్టివ్‌ 2’లో నటించనున్నారు. ఆ మూవీకి డైరెక్షన్‌ కూడా ఆయనే చేయనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని