Vishwak sen: ‘గామి’ గురించి కూడా నలుగురు పెద్ద మనుషులు మాట్లాడాలి: విశ్వక్‌సేన్‌

‘గామి’ గురించి కూడా పెద్ద మనుషులు మాట్లాడాలని విశ్వక్ సేన్‌ అన్నారు.

Published : 14 Mar 2024 10:59 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విశ్వక్‌ సేన్‌ (Vishwak sen) హీరోగా తెరకెక్కిన చిత్రం ‘గామి’ (Gaami). విద్యాధర్‌ కాగిత ఈ మూవీతో దర్శకుడిగా పరిచయమయ్యారు. మార్చి 8న విడుదలైన ఈ చిత్రం పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. తాజాగా తిరుపతి వెళ్లిన విశ్వక్ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘చాలా రిస్క్‌ చేసి ‘గామి’ తీశాం. ఇది కమర్షియల్‌గా హిట్‌ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. మేం ఆరేళ్లు కష్టపడి తీసిన సినిమా ఇది. మా సినిమానలుగురు పెద్ద మనుషులు చూసి..  మాట్లాడితే బాగుంటుంది. ఇది మన తెలుగు సినిమా. ఇలాంటి చిత్రం ఇప్పటి వరకు రాలేదని గర్వంగా చెబుతాను. మరో 20 ఏళ్ల తర్వాత తెలుగులో ఇలాంటి సినిమా వచ్చిందని గర్వంగా చెప్పొచ్చు. నేను ఓవర్ కాన్ఫిడెన్స్‌తో చెబుతోన్న మాటలు కావు. సినిమా రిలీజైన నాలుగు రోజులకు చెబుతున్నానంటే నాకెంత నమ్మకముందో అర్థం చేసుకోవాలి. కొందరు కావాలనే నెగెటివ్‌ రివ్యూ ఇస్తున్నారు. ఇదంతా ఎవరు చేస్తున్నారో తెలియదు. వారి గురించి పట్టించుకునేంత సమయం నాకు లేదు’ అన్నారు. ఈ చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు విశ్వక్‌ ధన్యవాదాలు చెప్పారు.

గిరిజ, సాయి పల్లవిలా మమితా బైజు.. రాజమౌళి మెచ్చిన ఈ నటి ఎవరు?

ప్రస్తుతం విశ్వక్‌ సేన్‌ ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ (Gangs of Godavari)లో నటిస్తున్నారు. కృష్ణచైతన్య దర్శకత్వంలో ఇది రానుంది. గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్‌, వినోదం నిండిన కథతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఇందులో ఆయన పూర్తి మాస్‌ గెటప్‌లో కనిపించనున్నారు. నేహాశెట్టి హీరోయిన్‌గా అలరించనున్నారు. ఇప్పటికే పాటలకు మంచి ప్రేక్షకాదరణ వచ్చింది. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని