Bollywood: బాలీవుడ్‌లో షారుక్‌ చేసే రాజకీయాలు నచ్చవు: వివేక్ అగ్నిహోత్రి

బాలీవుడ్‌ స్టార్‌ హీరో షారుక్‌పై దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. షారుక్‌ అంటే ఇష్టమని చెప్పారు. కానీ, ఆయన చేసే రాజకీయాలంటే నచ్చవన్నారు.

Published : 18 Aug 2023 16:36 IST

ముంబయి: బాలీవుడ్‌ దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి (Vivek Agnihotri) మరోసారి అగ్ర హీరోపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. షారుక్‌ ఖాన్‌కు (Shah Rukh Khan) తాను అభిమానినంటూనే ఆయనపై విమర్శలు కురిపించారు. బాలీవుడ్‌ బాద్‌షాగా కొన్ని దశాబ్దాల నుంచి అతి పెద్ద ఇండస్ట్రీని షారుక్‌ ఏలుతున్నారని వివేక్‌ అగ్నిహోత్రి అన్నారు. కానీ షారుక్‌ ఖాన్‌ చేసే రాజకీయాలంటే తనకు నచ్చవని చెప్పారు.

‘‘నేను షారుక్‌కు అభిమానిని. ఆయనకు ఉన్నంత చరిష్మా సినీ పరిశ్రమలో మరే నటుడికీ లేదు. కానీ, నాకు ఆయన చేసే రాజకీయాలు నచ్చవు. ఇలాంటి హీరోల వల్లే బాలీవుడ్‌కు చెడ్డ పేరు వస్తుందని నా అభిప్రాయం. ఇలాంటి వాళ్లు స్టార్‌డమ్‌ లేకుండా దేన్నీ అంగీకరించరు. అలాగే నాకు షారుక్‌తో ఉన్న రెండో అతి పెద్ద సమస్య ఏంటంటే.. ప్రేక్షకులకు ఏమీ తెలియదని ఆయన భావిస్తారు. ఈ విషయాన్ని నేను భరించలేను. నేను ప్రజలకు నచ్చే సినిమాలు తీస్తాను. వాళ్లు బాక్సాఫీస్‌ కలెక్షన్ల కోసం సినిమాలు తీస్తారు. ఏదైనా చిత్రం విజయం సాధిస్తే అది షారుక్‌దని అంటారు. కానీ, నా సినిమా సక్సెస్‌ అయితే అది ప్రజల చిత్రమని అంటాను. మా ఇద్దరిదీ భిన్న వైఖరి. అయినా షారుక్‌ అంటే నాకు చాలా ఇష్టం. ఆయనతో సినిమా తీయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. అతడితో కలిసి పనిచేయడానికి నాకు ఎలాంటి సమస్యా లేదు’’ అని వివేక్‌ అగ్ని హోత్రి అన్నారు.

‘ఆ సినిమాలోకి నన్నెందుకు తీసుకోలేదు’: ‘ఛత్రపతి’ నటి అసహనం

‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’తో సంచలనం సృష్టించిన ఈ దర్శకుడు.. త్వరలోనే ‘ది వ్యాక్సిన్ వార్‌’ (The Vaccine War) చిత్రంతో పలకరించనున్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా రానున్న ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. హిందీతో పాటు 10 భాషల్లో ఈ చిత్రం అలరించనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని