Vyooham: ఓటీటీలో ‘వ్యూహం’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

‘వ్యూహం’ పేరుతో ఓ వెబ్‌సిరీస్‌ తెలుగు ప్రేక్షకులను అలరించడానికి వస్తోంది.

Updated : 11 Dec 2023 20:38 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘వ్యూహం’ (Vyooham) పేరుతో ఓ తెలుగు వెబ్‌సిరీస్‌ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. సాయి సుశాంత్‌రెడ్డి, చైతన్యకృష్ణ, పావని గంగిరెడ్డి, రవీంద్ర విజయ్‌, శశాంక్‌ కీలక పాత్రల్లో శశికాంత్‌ పీసపాటి దర్శకత్వంలో ఈ ‘వ్యూహం’ తెరకెక్కింది. అన్నపూర్ణా స్టూడియోస్‌ బ్యానర్‌పై సుప్రియ యార్లగడ్డ ఈ సిరీస్‌ను నిర్మించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘వ్యూహం’ డిసెంబరు 14వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ వేదికగా అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా తెలుగులో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ అమెజాన్‌ ప్రైమ్‌ పోస్టర్‌ను విడుదల చేసింది. క్రైమ్‌ ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌గా ‘వ్యూహం’ (Vyooham) తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. న్యాయం కోసం ఓ పోలీస్‌ ఆఫీసర్‌ ఏం చేశాడన్న అంశాన్ని ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని