‘ఖిలాడి’టీమ్‌లో యాక్షన్‌ కింగ్‌!

మాస్‌మహారాజ్‌ రవితేజ హీరోగా ‘ఖిలాడి’చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘వీర’సినిమాతో రవితేజకు హిట్టిచ్చిన రమేష్‌వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో ఒక ప్రధాన పాత్రలో యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ నటించనున్నారని తాజాగా చిత్రబృందం

Published : 30 Jan 2021 12:45 IST

హైదరాబాద్‌: మాస్‌మహారాజ్‌ రవితేజ హీరోగా ‘ఖిలాడి’చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘వీర’సినిమాతో రవితేజకు హిట్టిచ్చిన రమేశ్‌ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో ఒక ప్రధాన పాత్రలో యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ నటించనున్నారని తాజాగా చిత్రబృందం ప్రకటించింది. ఈ మధ్యకాలంలో అర్జున్‌ అటు తమిళ, ఇటు తెలుగు చిత్రాల్లో కీలకపాత్రలు పోషిస్తూ అలరిస్తున్నారు. ‘ఖిలాడి’చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తుండగా  పెన్‌ స్టూడియోస్‌ పతాకంపై కోనేరు సత్యనారయణ నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన రవితేజ ఎంట్రీ గ్లింప్స్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది!

ఇవీ చదవండి!

శర్వా, సిద్దార్థ్‌లూ వచ్చేస్తున్నారు..!

చిరు రేర్‌ వీడియో.. జగన్‌తో విష్ణు.. సుమ అల్లరి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని