Akhil: కోలీవుడ్‌ దర్శకుడితో అఖిల్‌ సినిమా..?

నటుడు అఖిల్ (Akhil) కొత్త సినిమాకు సంబంధించిన ప్రచారం జోరందుకుంది. కోలీవుడ్‌ దర్శకుడితో ఆయన సినిమా చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Published : 24 Sep 2023 13:32 IST

హైదరాబాద్‌: ‘ఏజెంట్‌’ (Agent)తో ఈ ఏడాది ఆరంభంలోనే పరాజయాన్ని అందుకున్నారు నటుడు అఖిల్‌ (Akhil). ఈ సినిమా తర్వాత ఆయన ఏ ప్రాజెక్టునూ ప్రకటించలేదు. ఈ క్రమంలోనే ఆయన తదుపరి సినిమా ఎవరితో చేస్తారో..? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా అఖిల్‌ కొత్త చిత్రానికి సంబంధించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.

కోలీవుడ్‌ దర్శకుడు లింగుస్వామితో కలిసి ఆయన సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అఖిల్‌.. ఇప్పటికే లింగుస్వామి కథకు ఓకే చెప్పారంటూ ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఇది పట్టాలెక్కనుందన్నది దాని సారాంశం. అయితే, ఈ వార్తలకు సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మరోవైపు ‘వారియర్‌’ తర్వాత లింగుస్వామి కూడా ఏ ప్రాజెక్ట్‌నూ ప్రకటించలేదు.

అతడి సంగతి నాకు తెలియదు.. నేనైతే రష్మికతో మాట్లాడుతున్నా: రక్షిత్‌శెట్టి

‘ఏజెంట్‌’ విషయానికి వస్తే.. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహించారు. సాక్షి వైద్య కథానాయిక. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అనుకోనివిధంగా పరాజయాన్ని అందుకుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌కు రంగం సిద్ధమైది. ‘సోనీలివ్‌’ (SonyLiv)లో ఈ నెల 29 నుంచి స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉండనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని