Yashoda: ‘యశోద’ ఓటీటీలోకి వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
సమంత ప్రధాన పాత్రలో హరి, హరిశ్ సంయుక్తంగా తెరకెక్కించిన చిత్రం ‘యశోద’. త్వరలోనే ఈ సినిమా ఓటీటీలోకి రానుంది.
ఇంటర్నెట్ డెస్క్: సమంత ప్రధాన పాత్ర పోషించిన ‘యశోద’ (Yashoda) చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ (Amazon Prime Video)లో ఈ నెల 9 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రం అందుబాటులో ఉంటుందని సదరు సంస్థ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. హరి- హరీశ్ సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ సినిమా థియేటర్లలో నవంబరు 11న విడుదలైన సంగతి తెలిసిందే. సమంత (Samantha) నటనకు ప్రేక్షకులు మంచి మార్కులు వేశారు. సరోగసి పేరుతో జరిగే మోసాల నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్‌కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేశ్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
ఇదీ కథ: యశోద (సమంత) మధ్య తరగతి అమ్మాయి. ఆర్థిక అవసరాల రీత్యా సరోగసి పద్ధతిలో బిడ్డకి జన్మనివ్వడం కోసం డా. మధు (వరలక్ష్మి శరత్‌కుమార్)కి చెందిన ఆస్పత్రిలో చేరుతుంది. ప్రత్యేక ప్రపంచంలా అనిపించే ఆ హాస్పిటల్లో జరిగే కొన్ని పరిణామాలు యశోదలో అనుమానం రేకెత్తిస్తాయి. తనతోపాటు బిడ్డలకి జన్మనివ్వడం కోసం ఆస్పత్రిలో చేరిన తోటి మహిళలు అనుమానాస్పద రీతిలో కనుమరుగైపోతుంటారు. ఇంతకీ ఆ మహిళలు ఏమవుతున్నారు? యశోద తన అనుమానాల్ని నివృత్తి చేసుకోవడం కోసం ఏం చేసింది? ఆ ఆ క్రమంలో ఆమెకి ఎలాంటి విషయాలు తెలిశాయి? ఆ ఆస్పత్రిలో సంఘటనలకీ, బయట జరిగిన మరో రెండు హత్యలకీ సంబంధమేమిటనేది మిగతా కథ.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Telugu Movies: ఈ వారం థియేటర్/ఓటీటీలో వచ్చే చిత్రాలివే!
-
Sports News
IND vs NZ: చాహల్ విషయంలో హార్దిక్ నిర్ణయం సరైంది కాదు: గంభీర్
-
World News
Pakistan: మసీదులో బాంబు పేలుడు.. 28మంది మృతి, 150మందికి గాయాలు
-
General News
TS HighCourt: తొలగిన ప్రతిష్టంభన... గవర్నర్ ప్రసంగంతోనే బడ్జెట్ సమావేశాలు
-
Movies News
Social Look: సోలోగా సదా.. క్యూట్‌గా ఐశ్వర్య.. గులాబీలతో నభా!
-
World News
Imran Khan: ఒకే ఒక్కడు.. ఏకంగా 33 స్థానాల్లో ఇమ్రాన్ ఖాన్ పోటీ