డెట్రాయిట్‌ తెలుగు అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది ఉత్సవాలు

అమెరికాలోని డెట్రాయిట్‌ తెలుగు అసోసియేషన్‌ (DTA) ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలను అట్టహాసంగా నిర్వహించారు. ఏప్రిల్‌ 29న నిర్వహించిన ఈ వేడుకలకు మాజీ ఎంపీ, రచయిత యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

Published : 02 May 2023 12:54 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికాలోని డెట్రాయిట్‌ తెలుగు అసోసియేషన్‌ (DTA) ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలను అట్టహాసంగా నిర్వహించారు. ఏప్రిల్‌ 29న నిర్వహించిన ఈ వేడుకలకు మాజీ ఎంపీ, రచయిత యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలపై ఆయన తన ప్రసంగంతో అందర్నీ ఉత్తేజపరిచారు. ఈ సందర్భంగా ప్రముఖ గాయని సునీత నేతృత్వంలో జరిగిన మ్యూజికల్‌ లైవ్‌ కాన్సర్ట్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 

ఉత్సవాల్లో భాగంగా 300పైగా ప్రతిభావంతులైన చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రదర్శించి ప్రేక్షకులను అలరించారు. అనంతరం సాయంత్రం  7 గంటల నుంచి రాత్రి 12 వరకు సునీత బృందం తమ పాటలతో ప్రేక్షకులను మైమరపించారు. ఆ తర్వాత సునీతకు డెట్రాయిట్‌ తెలుగు అసోసియేషన్‌ సభ్యులు, తెలుగు ఆడపచులు సన్మానం చేశారు.  అనంతరం ఈ కార్యక్రమానికి వచ్చిన వారికి తెలుగు రుచులతో భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ ఉగాది వేడుకలకు వ్యాఖ్యాతగా ఉదయ్‌ చాపలమడుగు వ్యవహరించారు. 

ఈ కార్యక్రమంలో తానా బృందం అంజయ్య చౌదరి లావు, హనుమయ్య బండ్ల, సునీల్‌ పంత్ర, శ్రీనివాస్‌ గోగినేని, శ్రీని లావు, రాజా కాసుకుర్తి, ఠాగూర్‌ మల్లినేని, ఉమా అరమాండ్లకాటికి, జానీ నిమ్మలపూడి, నాగమల్లేశ్వర పంచుమర్తి హాజరయ్యారు. వీరితో పాటు డెట్రాయిట్‌ తెలుగు అసోసియేషన్‌ పూర్వ అధ్యక్షులు నీలిమ మన్నే, జోగేశ్వరరావు పెద్దిబోయిన, కోనేరు శ్రీనివాస్‌, వెంకట్‌ ఎక్కా, రమణ ముద్దెగంటి, సుధీర్‌బచ్చు, ద్వారకా ప్రసాద్‌ బొప్పన, సత్యం నేరుసు, సంతోష్‌ ఆత్మకూరి పాల్గొన్నారు. 

ఈ ఉగాది ఉత్సవాల్లో అన్నీ సజావుగా జరిగేందుకు తెరవెనుక కృషి చేసిన ఈవెంట్‌ కోఆర్డినేటర్లు, వాలంటీర్లు కుసుమ కల్యాణి అక్కిరెడ్డి, సుబ్రత గడ్డం, అర్చన చావళ్ల, ప్రణీత్‌ నాని, తేజ్‌ కైలాష్‌ అంగిరేకుల, దీప్తి చిత్రపు, స్వప్న ఎల్లెందుల, శ్రుతి బుసరి, రాజా తొట్టెంపూడి, సంజు పెద్ది తదితరులకు డెట్రాయిట్‌ తెలుగు అసోసియేషన్‌ అభినందనలు తెలిపింది. ఇది ఓ మినీ కన్వెన్షన్‌ తలపించేలా కార్యక్రమాన్ని నిర్వహించారంటూ  డెట్రాయిట్‌ తెలుగు అసోసియేషన్‌ అధ్యక్షుడు కిరణ్‌ దుగ్గిరాల, కార్యవర్గ సభ్యులను అతిథులు ప్రశంసించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని