సింగపూర్‌లో ఘనంగా వినాయక చవితి

సింగపూర్‌లో ‘సింగపూర్‌ తెలుగు సమాజం’ ఆధ్వర్యంలో వినాకయ చవితిని ఘనంగా నిర్వహించారు. స్థానిక పీజీపీ హాల్‌లో వినాయకుడికి భక్తిశ్రద్ధలతో పూజలు...

Published : 05 Sep 2022 23:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సింగపూర్‌లో ‘సింగపూర్‌ తెలుగు సమాజం’ ఆధ్వర్యంలో వినాయక చవితి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక పీజీపీ హాల్‌లో వినాయకుడికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన గణనాథుని ప్రతిమ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. పూజలో భాగంగా వేదపండితులు గణేశుని గొప్పతనం గురించి వివరించారు. సుమారు 100 మంది బాలబాలికలు బాల గణపతి పూజలో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ‘సింగపూర్‌ తెలుగు సమాజం’ అధ్యక్షుడు కోటిరెడ్డి మాట్లాడుతూ.. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. పూజలో పాల్గొన్న పిల్లలందరికీ ప్రత్యేకంగా మట్టితో చేసిన బాల గణపతి విగ్రహాన్ని అందించామని, గణపతి పూజకు హాజరైన సుమారు 500 మందికి 21 రకాల పత్రిని ఉచితంగా అందజేశామన్నారు. కార్యక్రమ నిర్వాహకులు రవి సోమా మాట్లాడుతూ.. అందరికీ గణేశుని ఆశీస్సులు అందించాలనే ఉద్దేశంతో నిర్వహించిన ఈ పూజా కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా సుమారు 500మంది, 3500 మంది అంతర్జాలం ద్వారా వీక్షించారని తెలిపారు. అందరి మంచి కోసం నిర్వహించిన కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ఎంతోమంది సహకరించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కార్యవర్గసభ్యులకు, దాతలకు, పూజా కార్యక్రమాల్లో వారికి కార్యదర్శి సత్య చిర్ల కృతజ్ఞతలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని