జగన్ అవమానించింది ఎన్టీఆర్‌ని కాదు, తెలుగు వారిని: జయరాం కోమటి!

దిల్లీ స్థాయిలో ఏ గుర్తింపు లేకుండా మద్రాసీలుగా పిలిచే తెలుగు ప్రజలకు అది అందర్నీ శాసించే జాతి అనే స్థాయి

Published : 22 Sep 2022 16:47 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దిల్లీ స్థాయిలో ఏ గుర్తింపు లేకుండా మద్రాసీలుగా పిలిచే తెలుగు ప్రజలకు అది అందర్నీ శాసించే జాతి అనే స్థాయి గుర్తింపు తేవడంలో తెదేపా వ్యవస్థాపకులు, దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్‌ చేసిన కృషి అనన్య సామాన్యమైనదని ఎన్‌ఆర్‌ఐ తెదేపా అమెరికా కో-ఆర్డినేటర్‌ జయరాం కోమటి అన్నారు. తెలుగువారికి అంతటి గౌరవం, గుర్తింపు తెచ్చిన అన్నగారికి ఆయన సొంత జిల్లా (పూర్వపు కృష్ణా)లో అవమానిస్తూ హెల్త్‌ యూనివర్సిటీకి ఆయన పేరును తొలగించడం అత్యంత హేయమైనదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేరు తొలగించడమంటే ఆయనకు నష్టం చేసినట్లు కాదని.. తెలుగువారిని నొప్పించినట్లు అని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో సీఎం జగన్‌ చేసిన పొరపాటు ఆయనకు రాజకీయ సమాధి కట్టనుందని హెచ్చరించారు. జగన్‌ వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే ప్రతి తెలుగువాడు తిరగబడతారన్నారు. అది ఒక ఉద్యమంలా పైకి కనిపించకపోయినా ఓటు రూపంలో ఓ పోటు జగన్‌కు తెలుస్తుందన్నారు. ఎన్టీఆర్ నెలకొల్పిన తొలి వైద్య విశ్వవిద్యాలయానికి ఆయన పేరు తొలగించడం చారిత్రక తప్పిదమన్నారు. జగన్ తన తప్పు తెలుసుకుని వెంటనే ఎన్టీఆర్ పేరు పెడితే మంచిది, లేదంటే తిరిగి ఎన్టీఆర్ పేరు ఆ యూనివర్సిటీకి పెట్టే వరకు తెలుగు ప్రజలు ఆ విషయాన్ని వదిలిపెట్టరన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని