Justice NV ramana: శాన్‌ ఫ్రాన్సిస్కోలో సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ దంపతులకు ఘన స్వాగతం

అమెరికాలో పర్యటిస్తున్న భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ దంపతులకు శాన్‌ ఫ్రాన్సిస్కోలో ఘన స్వాగతం లభించింది. అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండో...

Published : 29 Jun 2022 19:58 IST

శాన్‌ ఫ్రాన్సిస్కో: అమెరికాలో పర్యటిస్తున్న భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ దంపతులకు శాన్‌ ఫ్రాన్సిస్కోలో ఘన స్వాగతం లభించింది. అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండో అమెరికన్స్‌ (AIA) ఆహ్వానం మేరకు శాన్‌ ఫ్రాన్సిస్కో చేరుకున్న సీజేఐ దంపతులకు విమానాశ్రయంలో ఏఐఏ అధ్యక్షుడు కోమటి జయరాం తన కార్యవర్గంతో కలిసి ఘన స్వాగతం పలికారు. స్థానిక భారత కాన్సులేట్‌ సిబ్బంది... భారత ప్రభుత్వం తరఫున ఆహ్వానం పలికారు.  ఈ కార్యక్రమంలో భారత్‌ బయోటెక్‌ ఎండీ సుచిత్రా ఎల్లా, అసోసియేషన్‌ ఆఫ్ ఇండో అమెరిన్స్‌ కార్యవర్గ సభ్యులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని