అమెరికాలో తుపాకీ మిస్‌ఫైర్.. ఖమ్మం జిల్లా విద్యార్థి మృతి
అమెరికాలో తుపాకీ మిస్ ఫైర్ కావడంతో ఖమ్మం జిల్లాకు చెందిన విద్యార్థి మృతిచెందాడు. మధిర పట్టణానికి చెందిన మహంకాళి అఖిల్‌సాయి అనే విద్యార్థి ఎంఎస్ చదివేందుకు 13 నెలల క్రితం అమెరికా వెళ్లాడు.
మధిర గ్రామీణం: అమెరికాలో తుపాకీ మిస్ ఫైర్ కావడంతో ఖమ్మం జిల్లాకు చెందిన విద్యార్థి మృతిచెందాడు. మధిర పట్టణానికి చెందిన మహంకాళి అఖిల్‌సాయి అనే విద్యార్థి ఎంఎస్ చదివేందుకు 13 నెలల క్రితం అమెరికా వెళ్లాడు. అలబామాలోని అబర్న్ యూనివర్సిటీలో చదువుతున్నాడు. మరోవైపు అక్కడికి సమీపంలోని ఓ గ్యాస్ స్టేషన్‌లో పార్ట్‌టైమ్ జాబ్ కూడా చేస్తున్నాడు. అమెరికా కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 10 గంటల సమయంలో గ్యాస్‌స్టేషన్‌లోని సెక్యూరిటీ గార్డు వద్ద తుపాకీని పరిశీలిస్తున్న క్రమంలో అది మిస్ ఫైర్ అయింది. అఖిల్ సాయి తలలోకి బుల్లెట్ దూసుకెళ్లడంతో అక్కడికి సిబ్బంది హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అఖిల్ మృతిచెందాడు. అఖిల్ సాయి మృతిపై కుటుంబసభ్యులకు సమాచారం అందింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
MIW vs RCBW: విజృంభించిన ముంబయి బౌలర్లు.. స్వల్ప స్కోరుకే పరిమితమైన ఆర్సీబీ
-
India News
Amritpal Singh: టోల్‌ప్లాజా వద్ద కారులో అమృత్‌పాల్ సింగ్..!
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Sports News
Virender Sehwag : అప్పుడు దాన్ని తప్పనిసరి చేసిఉంటే.. చాలా మంది దిగ్గజాలు ఫెయిలై ఉండేవాళ్లు : సెహ్వాగ్
-
Crime News
TSPSC: రాజశేఖర్ ఇంట్లో మరికొన్ని ప్రశ్నపత్రాలు.. నాలుగో రోజు విచారణలో కీలక ఆధారాలు
-
General News
Ap Special Status: ఏపీకి ప్రత్యేక హోదాపై మరోసారి తేల్చి చెప్పిన కేంద్రం