చంద్రబాబు అక్రమ అరెస్టుపై లండన్‌లో ప్రవాసాంధ్రుల నిరసన

తెదేపా అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లోనూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.

Updated : 17 Sep 2023 18:19 IST

లండన్‌: తెదేపా అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లోనూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. వైకాపా సర్కార్‌ అనుసరిస్తున్న కక్షపూరిత విధానాలను వ్యతిరేకిస్తూ  జనం రోడ్లపైకి వచ్చి చంద్రబాబుకు మద్దతుగా నిలుస్తున్నారు. ఇందులో భాగంగా లండన్‌లోని పార్లమెంట్‌ ఎదురుగా కుల, మత, పార్టీలకు అతీతంగా దాదాపు 1000 మంది ప్రవాసాంధ్రులు నిరసన తెలిపారు. యూకే వ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల నుంచి తరలివచ్చి నల్లచొక్కాలు ధరించి గాంధీ విగ్రహం వద్ద నిరసనల్లో పాల్గొన్నారు.

చంద్రబాబుకు మద్దతుగా, వైకాపా సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా కేవలం వ్యక్తిగత కక్షతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ప్రవాసాంధ్రులు మండిపడ్డారు. రాష్ట్ర ప్రగతి కోసం 40 ఏళ్లుగా కష్టపడి పనిచేసిన చంద్రబాబును తప్పుడు కేసుల్లో ఇరికించడం ప్రజస్వామ్యానికే గొడ్డలి పెట్టు అని.. అలాంటి వ్యక్తి పట్ల ఏపీ సర్కార్‌ అనుసరిస్తున్న తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని