NTR: నెదర్లాండ్స్‌లో వైభవంగా ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు
తెలుగు ప్రజల ఆరాధ్యదైవం ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను నెదర్లాండ్స్‌లోని ది హేగ్ నగరంలో ఘనంగా నిర్వహించారు.

ది హేగ్: నెదర్లాండ్స్‌లోని ది హేగ్ నగరంలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మే 21న జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ నగరాల నుండి వచ్చిన ఎన్టీఆర్ అభిమానులు ముందుగా కేక్ కట్ చేసి పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రముఖ నటుడు మురళీ మోహన్, నిర్మాత అశ్వినీదత్, రంగస్థల కళాకారుడు గుమ్మడి గోపాలకృష్ణ ఆన్‌లైన్‌లో పాల్గొని ఎన్టీఆర్‌తో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో నెదర్లాండ్స్‌లోని ఎన్టీఆర్ అభిమాన సంఘం కార్యవర్గం సభ్యులు రామకృష్ణ ప్రసాద్, వివేక్ కరియావుల, వెంకట్ కోకా, తేజా గోయాల్లా, శ్యామ్ పంపానా, మధుకర్ రెడ్డి, సంపత్, ప్రసాద్, అమర్, నవీన్‌తోపాటు బెల్జియం నుండి వచ్చిన ఇతర అభిమానులు ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేశారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Raghunandan Rao: ఎమ్మెల్యే రఘునందన్‌రావుపై రూ.వెయ్యి కోట్ల పరువునష్టం దావా
-
Crime News
Crime News: బాగా చదివి లాయర్ కావాలనుకుని.. ఉన్మాది చేతిలో కత్తి పోట్లకు బలైపోయింది
-
World News
Cannes: కేన్స్ వేదికగా ఇరాన్లో మరణశిక్షణలు ఆపాలంటూ మోడల్ నిరసన
-
Politics News
Congress: ఆ ఒక్క ఎమ్మెల్యే తృణమూల్‌లో చేరిక.. బెంగాల్ అసెంబ్లీలో కాంగ్రెస్ మళ్లీ ఖాళీ!
-
Movies News
Chinmayi: స్టాలిన్ సార్.. వైరముత్తుపై చర్యలు తీసుకోండి: గాయని చిన్మయి
-
World News
Japan: ప్రధాని ఇంట్లో ప్రైవేటు పార్టీ.. విమర్శలు రావడంతో కుమారుడిపై వేటు!