హ్యాట్‌ఫీల్డ్‌లో ఎన్టీఆర్‌కు ఘన నివాళి

దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా ఇంగ్లాండ్‌లోని హ్యాట్‌ఫీల్డ్‌లో తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులు ఆయనకు నివాళులర్పించారు.

Published : 20 Jan 2023 00:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌:  దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా ఇంగ్లాండ్‌లోని హ్యాట్‌ఫీల్డ్‌లో తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులు ఆయనకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా శివరాం కూరపాటి మాట్లాడుతూ.. ‘ప్రపంచంలో ఏ దేశంలో ఉన్న తెలుగువారైనా నేను తెలుగువాణ్ని అనే భావావేశం నింపిన కారణజన్ముడు ఎన్టీఆర్‌.  జీవితంలో ఎన్నో జయాపజయాలను చూసిన ఆయన తెలుగుజాతి గుండెల్లో కొలువై ఉన్నారు. ఎన్టీఆర్‌ దూరమై నేటికి 27 ఏళ్లు అయినా ఇప్పటికీ  తెలుగు ప్రజలు లక్షల యూనిట్ల రక్తం ఏటా ఆయన పేరుమీద దానం చేస్తున్నారని పేర్కొన్నారు.  ఆయన స్ఫూర్తిని భావావేశాన్ని, భావజాలాన్ని నేటి తరానికి అందించాల్సిన బాధ్యత ప్రతి తెదేపా కార్యకర్త మీద ఉందని శివరాం పిలుపునిచ్చారు. నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏపీలో సైకో పాలనను తరిమికొట్టి సైకిల్ పాలన వచ్చేలా కృషి చేయాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో చంద్రబాబు నాయుడే అభ్యర్థి అన్నంత కసిగా పని చేసి తెదేపాను అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ త్వరలో ప్రారంభించనున్న‘యువగళం’ పాదయాత్రలో ఎన్నారై  తెదేపా కార్యకర్తలు పాల్గొని తమ వంతు బాధ్యతలు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో సతీష్ బోధనపు, కందుల రోహిత్ రెడ్డి, జగదీశ్ వీర్నా, శివ వెంపటి, మనోజ్, సుదర్శన్ రెడ్డి, అవినాష్ తదితరులు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని