న్యూజెర్సీలో ఘ‌నంగా వైకుంఠ ఏకాదశి వేడుక‌లు

హిందువులు అత్యంత పవిత్రంగా ఆచరించే వైకుంఠ ఏకాదశి వేడుకలు అమెరికాలోని న్యూజెర్సీలో ఘనంగా జరుపుకొన్నారు.

Published : 26 Dec 2023 23:27 IST

న్యూజెర్సీ: హిందువులు అత్యంత పవిత్రంగా ఆచరించే వైకుంఠ ఏకాదశి వేడుకలను అమెరికాలోని న్యూజెర్సీలో ఘనంగా జ‌రుపుకొన్నారు. హిందూ ఆధ్యాత్మిక ప్ర‌వాహాన్ని కొన‌సాగిస్తున్న న్యూజెర్సీలోని సాయిద‌త్తపీఠం శ్రీశివ విష్ణు దేవాల‌యం వేడుకలకు వేదికైంది. ఉద‌యం నుంచే స్థానిక ఎన్నారై భ‌క్తులు హ‌రి నామాన్ని స్మ‌రించుకుంటూ ఉత్త‌ర ద్వారం నుంచి ద‌ర్శించుకునేలా ఏర్పాట్లు చేశారు. ఈ సంద‌ర్భంగా వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్య‌త‌ను సాయిదత్త పీఠం నిర్వాహకులు రఘుశర్మ శంకరమంచి భ‌క్తులకు వివ‌రించారు. పురాణాల ప్రకారం విష్ణుమూర్తి గరుడ వాహనంపై ముల్లోకాల నుంచి ముక్కోటి దేవతలతో కలిసి భూలోకంలోకి అడుగు పెట్టి భక్తులందరికీ దర్శనమిస్తారు. అందుకే ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటారని ఆయ‌న తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని