JTS: జపాన్‌ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో వనభోజనాలు

జపాన్‌ తెలుగు సమాఖ్య (JTS) ఆధ్వర్యంలో వనభోజనాలు ఘనంగా నిర్వహించారు.

Published : 04 Nov 2023 16:50 IST

టోక్యో: జపాన్‌ తెలుగు సమాఖ్య (JTS) ఆధ్వర్యంలో వనభోజనాలు ఘనంగా నిర్వహించారు. టోక్యో నగరంలోని కోమట్సుగవా పార్కులో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పిల్లలు, పెద్దలు అంతాకలిసి దాదాపు 150 మందికిపైగా పాల్గొన్నారు. ఉదయం 10 గంటల కల్లా అంతా ఒక్క చోట చేరి.. ఆటపాటలతో రోజంతా సందడిగా గడిపారు. సమాఖ్యలోకి కొత్తగా చేరిన సభ్యులను పరిచయం చేశారు. ఈ సందర్భంగా వాళ్లంతా టోక్యోతో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. మధ్యాహ్నం భోజనాలు ముగిసిన తర్వాత JTS వాలంటీర్లు చిన్నారులందరికి ప్రత్యేకంగా ఆటల పోటీలు ఏర్పాటు చేశారు. జపాన్‌ తెలుగు సమాఖ్య స్వచ్ఛందసేవ అనే మౌలిక సూత్రంపై పని చేస్తోందని నిర్వాహకులు వెల్లడించారు. ప్రజాస్వామ్య విలువల్ని పూర్తిగా అనసరిస్తున్నట్టు చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ప్రజల మధ్య సహకార స్ఫూర్తి కలుగుతుందని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు గతంలో స్వచ్ఛందసేవ చేసిన వారికి నివాళులర్పించడమే కాకుండా.. ప్రస్తుత వాలంటీర్లకు ఓ స్ఫూర్తిగా నిలుస్తాయని అన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారందరికీ జేటీఎస్‌ కార్యవర్గం అభినందనలు తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని