Chandrababu Arrest: అమీర్‌పేటలో చంద్రబాబుకు మద్దతుగా భారీ ర్యాలీ

తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ ఏపీ, తెలంగాణలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.

Published : 24 Sep 2023 20:32 IST

హైదరాబాద్‌: తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ ఏపీ, తెలంగాణలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబుకు మద్దతుగా ఆదివారం సాయంత్రం హైదరాబాద్ అమీర్‌పేటలోని సారథి స్టూడియో నుంచి ఆర్బీఐ క్వార్టర్స్‌ ఎన్టీఆర్‌ విగ్రహం వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. తెదేపా కార్యకర్తలతో పాటు చంద్రబాబు మద్దతు దారులు భారీగా హాజరై సీబీఎన్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ర్యాలీలో మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు పాల్గొని సంఘీభావం తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు