BJP: భాజపాకు షాక్‌.. కాంగ్రెస్‌లో చేరిన చురు ఎంపీ రాహుల్‌ కస్వాన్‌

లోక్‌సభ ఎన్నికల వేళ రాజస్థాన్‌లో భాజపా ఎంపీ రాహుల్‌ కస్వాన్‌ కాంగ్రెస్‌లో చేరారు.

Updated : 19 Mar 2024 13:19 IST

జైపుర్‌: లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) వేళ దేశంలోని పలుచోట్ల రాజకీయ పార్టీల నేతల వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా రాజస్థాన్‌లో భాజపా (BJP)కు షాక్‌ తగిలింది. చురు లోక్‌సభ స్థానం నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిచిన రాహుల్‌ కస్వాన్‌ (Rahul Kaswan) భాజపాకు రాజీనామా చేశారు. అంతేకాకుండా తన ఎంపీ పదవికి సైతం రాజీనామా చేసి.. వెంటనే కాంగ్రెస్‌ పార్టీ (Congress)లో చేరిపోయారు.  వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఆయనకు సీటు నిరాకరించడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.  చురు ఎంపీగా రెండుసార్లు పనిచేసే అవకాశం కల్పించినందుకు ప్రధాని నరేంద్రమోదీ, ఇతర నేతలకు కృతజ్ఞతలు తెలిపారు.

రేపటిలోగా ఎన్నికల బాండ్ల వివరాలు ఇవ్వాల్సిందే..: ఎస్‌బీఐకి సుప్రీం ఆదేశాలు

‘రాజకీయ కారణాల వల్ల  ఈ క్షణమే భాజపా ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నా’’ అని రాహుల్‌ కస్వాన్‌ ‘ఎక్స్‌’ వేదికగా వెల్లడించారు. చురు సీటు నుంచి పదేళ్లుగా సేవలందించేందుకు అవకాశం కల్పించిన భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్‌ షాలకు కృతజ్ఞతలు తెలిపారు. చురు నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిచిన కస్వాన్ స్థానంలో భాజపా వచ్చే ఎన్నికల్లో పారాలింపిక్‌లో స్వర్ణ పతక విజేత దేవేంద్ర ఝఝరియాను బరిలో దించింది. దీంతో మనస్తాపం చెందిన రాహుల్‌ కస్వాన్‌ భాజపాకు గుడ్‌బై చెప్పి కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో ‘హస్తం’ గూటికి చేరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు