TDP: మాచర్లలో రిగ్గింగ్ జరగకుండా చూడాలి: సీఈవోని కోరిన తెదేపా నేత బ్రహ్మారెడ్డి

మాచర్లలో రిగ్గింగ్ జరగకుండా చూడాలని తెదేపా నేత బ్రహ్మారెడ్డి ఏపీ సీఈవోకి ఫిర్యాదు చేశారు. 

Updated : 20 Feb 2024 20:07 IST

అమరావతి: సీఈవో ముఖేష్‌ కుమార్‌ మీనాను పల్నాడు జిల్లా తెదేపా మాచర్ల నియోజకవర్గ ఇన్‌ఛార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి కలిశారు. తమ నియోజకవర్గ పరిధిలో రిగ్గింగ్‌ జరగకుండా చూడాలని సీఈవోకి వినతిపత్రం అందజేశారు. మాచర్ల పరిధిలోని 9 గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాల్లో రిగ్గింగ్ జరిగే ఆస్కారం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. 2009, 2014, 2019లో కాంగ్రెస్‌, వైకాపా రిగ్గింగ్‌కు పాల్పడ్డాయని ఆరోపించారు. ఇందుకు సంబంధించి స్థానిక ఎన్నికల్లో వైకాపా ఏకగ్రీవ స్థానాల వివరాలను సీఈవోకి అందజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని