Nara Lokesh: సైకో పాలనలో సైకిల్ తొక్కినా నేరమే!: నారా లోకేశ్‌

సైకో పాలనలో సైకిల్ తొక్కినా నేరమే! అంటూ తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. 

Published : 21 Oct 2023 10:41 IST

అమరావతి: సైకో పాలనలో సైకిల్ తొక్కినా నేరమే! అంటూ తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు. పాపాల పెద్దిరెడ్డి అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని దుయ్యబట్టారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. 

‘‘అహంకారం నెత్తికెక్కిన పెద్దిరెడ్డి అనుచరుడు సూరి.. పుంగనూరు మండలం సుగాలిమిట్ట వద్ద శ్రీకాకుళం నుంచి కుప్పం వరకూ సైకిల్ యాత్ర చేస్తున్న తెదేపా కార్యకర్తల చొక్కాలు విప్పించి, జెండాలు పీకి దాడికి పాల్పడ్డాడు. బాబుతో నేను అంటూ సైకిల్ యాత్ర చేస్తున్న తెదేపా కార్యకర్తలపై పెద్దిరెడ్డి రౌడీ గ్యాంగ్ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజలు అధికారం ఇచ్చింది తెదేపా కార్యకర్తల చొక్కాలు విప్పించడానికి, జెండాలు పీకడానికా జగన్? వచ్చే ఎన్నికల్లో వైకాపా నాయకుల చొక్కాలు విప్పి నడిరోడ్డుపై నిలబెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు’’ అని లోకేశ్‌ మండిపడ్డారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని