FIFA: ప్రాణం తీసిన సెల్ఫ్ గోల్..!
క్రీడల్లో బెట్టింగులు చేరితే ఆటగాళ్లకు ఎంత ప్రాణాంతకమో 1994లో ఫుట్‌బాలర్ ఎస్కొబార్ హత్య ప్రపంచానికి తెలియజేసింది. ఆ ఏడాది ప్రపంచకప్‌లో చేసిన ఒక్క సెల్ఫ్‌గోల్ అతడి ప్రాణాలను బలిగొంది.
ఇంటర్నెట్ డెస్క్: కొలంబియా 1994లో ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో రొమానియా చేతిలో 3-1 తేడాతో ఓడిపోయింది. ఆ జట్టు రెండో మ్యాచ్‌లో అమెరికాతో తలపడింది. నాకౌట్ దశకు చేరాలంటే ఇది గెలిచి తీరాలి. కానీ, మ్యాచ్‌కు కొలంబియా కీలక ఆటగాడు గాబ్రియేల్ గోమేజ్‌ను ఆడిస్తే జట్టు మొత్తాన్ని చంపుతామని బెదిరింపులు వచ్చాయని కోచ్ మటురాన జట్టు ఆటగాళ్లతో జరిగిన సమావేశంలో కన్నీరు పెట్టుకొన్నాడు. కొలంబియా ఆటగాళ్ల విలువ అంతర్జాతీయంగా పెరగకుండా ఆ దేశ ఫుట్‌బాల్ క్లబ్ ఓనర్ల కోసం అతడు అలా చేసినట్లు అనుమానాలు ఉన్నాయి. మటురాన కన్నీటితో కొలంబియా ఆటగాళ్లు చేసేది లేక గోమేజ్‌ను పక్కనపెట్టి ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగారు.
కీలక ఆటగాళ్లు లేకపోయినా కొలంబియానే ఈ మ్యాచ్‌లో హాట్‌ఫేవరెట్. మ్యాచ్ మొదలైనప్పటి నుంచి కొలంబియా ఆటగాళ్లు అమెరికా గోల్ పోస్టులపై భీకరంగా దాడులు చేశారు. కానీ, అమెరికన్ల రక్షణ వలయాన్ని మాత్రం ఛేదించలేకపోయారు. మ్యాచ్ తొలి అర్ధగంట పూర్తయ్యాక అమెరికా ప్రతిదాడులు ప్రారంభించింది. స్టెవార్ట్, హార్కీస్‌లు కొలంబియా గోల్‌పోస్టులపై దాడులకు నేతృత్వం వహించారు. 35వ నిమిషంలో కొలంబియా గోల్‌పోస్టు సమీపంలో హర్కీస్ బంతిని స్టెవార్ట్ దిశగా కొట్టాడు. కానీ, కొలంబియా ఆటగాడు ఎస్కొబార్ బంతిని స్టీవార్ట్‌కు అందకుండా చేసేందుకు యత్నించాడు. ఈ క్రమంలో అతడి షాట్‌కు బంతి అనూహ్యంగా కొలంబియా గోల్‌పోస్టులోకి వెళ్లింది. అమెరికాకు మ్యాచ్‌లో 1-0 ఆధిక్యం లభించింది.
కొలంబియాకు ఈ సెల్ఫ్‌గోల్ ఓ పెద్దషాక్. ఆ తర్వాత మ్యాచ్ 52వ నిమిషంలో అమెరికా ఆటగాడు స్టెవార్ట్ గోల్ చేయడంతో అమెరికాకు తిరుగులేని ఆధిక్యం లభించింది. మ్యాచ్ చివరి నిమిషం (90)లో కొలంబియా ఆటగాడు వాలెన్సియా గోల్ చేశాడు. అప్పటికే 2-1 తేడాతో జట్టు ఓటమి ఖాయమైంది. ఆ తర్వాత స్విట్జర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌ను 0-2తేడాతో కొలంబియా గెలిచింది. కానీ, అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో ఓటమి కారణంగా లీగ్ తరువాత ఇంటికి పోవాల్సి వచ్చింది. ఎస్కొబార్ సెల్ఫ్‌గోల్ లేకపోతే.. అమెరికాతో మ్యాచ్ డ్రా అయి నాకౌట్‌కు అవకాశాలు ఉండేవని కొలంబియా ఫుట్‌బాల్ అభిమానులు భావించారు. దీంతో స్వదేశంలో ఎస్కొబార్‌పై తీవ్ర ఆగ్రహం నెలకొంది.
కొలంబియా గ్రూప్ దశలోనే టోర్నీ బయటకు రాగానే.. ఎస్కొబార్ స్వదేశానికి వచ్చేశాడు. ఐదు రోజుల తర్వాత అతడు మిత్రుడితో కలిసి ఓ నైట్ క్లబ్‌కు వెళ్లాడు. అక్కడ తెల్లవారుజామున 3 గంటల వరకు ఉండి తర్వాత బయట పార్కింగ్‌కు చేరుకొన్నాడు. అక్కడ అప్పటికే వేచి ఉన్న కొందరు వ్యక్తులు ఎస్కొబార్‌తో గొడవ పెట్టుకొన్నారు. వారిలో ఇద్దరు హఠాత్తుగా తుపాకులు తీసి ఎస్కొబార్‌ను 6 సార్లు కాల్చారు. కాల్చే ప్రతిసారి ‘గో.... గో..’ అని పెద్దగా అరిచారు. వాస్తవానికి దక్షిణ అమెరికాలో గోల్ చేసిన సమయంలో ఫుట్‌బాట్ వ్యాఖ్యాతలు ‘గో’ అనే అంటారు. ఇక్కడ హంతకులు కూడా అలానే అరిచారు. దాదాపు అరగంట తర్వాత ఎస్కొబార్‌పై దాడి జరిగినట్లు ప్రపంచానికి తెలిసింది. ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే అతడు మృతి చెందినట్లు ప్రకటించారు.
ఎస్కొబార్ అంతిమ యాత్రలో 1,20,000 మందికి పైగా పాల్గొన్నారు. మర్నాడే ఈ హత్యకు పాల్పడిన ఓ డ్రగ్ కార్టెల్ బాడీగార్డ్‌ను అరెస్టు చేశారు. అతడు శాంటియాగో గాలన్ అనే డ్రగ్‌డాన్ కింద పనిచేస్తాడు. అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో కొలంబియా ఓటమితో శాంటియాగో బెట్టింగ్‌లో పెద్దమొత్తం పోగొట్టుకొన్నాడు. ఇతడిని కూడా అరెస్టు చేశారు. వీరిపై ఈ విచారణ కూడా సినిమాను తలపించేలా మలుపులు తిరిగింది. నిందితులకు శిక్షపడినా.. సత్ప్రవర్తన కారణంగా శిక్షాకాలాన్ని తగ్గించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Aadhaar: ఆధార్.. ఓటర్ ఐడీ అనుసంధానానికి గడువు పెంపు..!
-
Technology News
Legacy Contact: వారసత్వ నంబరు ఎలా?
-
Movies News
Mrunal Thakur: ‘నా కథను అందరితో పంచుకుంటా..’ కన్నీళ్లతో ఉన్న ఫొటో షేర్ చేసిన మృణాల్
-
World News
Earthquake: పాక్, అఫ్గాన్‌లో భూకంపం.. 11 మంది మృతి..!
-
Ts-top-news News
RTC Cargo: తూచింది 51 కేజీలు.. వచ్చింది 27 కేజీలు.. ఆర్టీసీ కార్గో నిర్వాకం
-
Movies News
Anasuya: ప్రెస్మీట్లో కన్నీరు పెట్టుకున్న అనసూయ