David Warner: ‘డేవిడ్ వార్నర్‌ను వదిలేసి సన్‌రైజర్స్‌ పెద్ద తప్పు చేసింది’

డేవిడ్‌ వార్నర్‌ (David Warner)ను వదులుకుని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (SRH)పెద్ద తప్పు చేసిందని  దిల్లీ క్యాపిటల్స్‌ అసిస్టెంట్‌ కోచ్‌ షేన్‌ వాట్సన్‌ అభిప్రాయపడ్డాడు. 

Published : 30 Mar 2023 01:51 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌-16 (IPL  16) సీజన్‌లో దిల్లీ క్యాపిటల్స్‌ను డేవిడ్‌ వార్నర్‌  (David Warner) తన వ్యూహాలతో అద్భుతంగా ముందుండి నడిపిస్తాడని దిల్లీ అసిస్టెంట్‌ కోచ్‌ షేన్‌ వాట్సన్‌ (Shane Watson) ఆశాభావం వ్యక్తం చేశాడు. రెగ్యులర్‌ కెప్టెన్‌ రిషభ్ పంత్ గతేడాది రోడ్డు ప్రమాదంలో గాయపడటంతో ఈ సీజన్‌కు అందుబాటులో లేకపోవడంతో వార్నర్‌ని సారథిగా నియమించిన విషయం తెలిసిందే. అయితే, వార్నర్‌కు ఐపీఎల్‌లో కెప్టెన్సీ కొత్తేమీకాదు. చాలా కాలంపాటు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (SRH) తరఫున ఆడిన అతడు..  2016లో ఎస్‌ఆర్‌హెచ్‌ని ఛాంపియన్‌గా నిలిపాడు. 2021లో అతడు కొన్ని మ్యాచ్‌ల్లో పేలవమైన ఆటతీరును కనబర్చాడు. దీంతో హైదరాబాద్‌ అతడిని తుదిజట్టు నుంచి తప్పించింది. 2022 వేలంలో అతడిని దిల్లీ క్యాపిటల్స్‌ దక్కించుకోగా.. ఆ సీజన్‌లో 150 కంటే ఎక్కువ స్ట్రైక్‌రేట్‌తో 432 పరుగులు చేశాడు.

ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై షేన్ వాట్సన్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. వార్నర్‌ని వదులుకుని సన్‌రైజర్స్‌ పెద్ద తప్పు చేసిందన్నాడు. ‘డేవిడ్‌ వార్నర్‌ అద్భుతమైన నాయకుడు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఐపీఎల్‌లో అతను ప్రతిసారీ రాణించాడు. మూడు, నాలుగు మ్యాచ్‌ల్లో వార్నర్‌ పెద్దగా పరుగులు చేయలేకపోయాడు. దీంతో అతడిని తుది జట్టు నుంచి తప్పించి సన్‌రైజర్స్‌ పెద్ద తప్పు చేసింది’ అని షేన్‌ వాట్సన్‌ అన్నాడు. ఈ సీజన్‌లో ఏప్రిల్‌ 1న లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌తో దిల్లీ క్యాపిటల్స్‌ తమ తొలి మ్యాచ్‌ ఆడనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని