IND vs SA: భారత్‌ గడ్డపై మాకు అదే అతిపెద్ద సవాల్‌: దక్షిణాఫ్రికా కెప్టెన్‌ బవుమా

మూడు టీ20లు, మూడు వన్డేలను ఆడేందుకు భారత్‌ పర్యటనకు దక్షిణాఫ్రికా వచ్చింది. ఇవాళ తిరువనంతపురం వేదికగా తొలి టీ20 మ్యాచ్‌ జరగనుంది. ఈక్రమంలో...

Published : 28 Sep 2022 18:06 IST

ఇంటర్నెట్ డెస్క్‌: మూడు టీ20లు, మూడు వన్డేలను ఆడేందుకు భారత్‌ పర్యటనకు దక్షిణాఫ్రికా వచ్చింది. ఇవాళ తిరువనంతపురం వేదికగా తొలి టీ20 మ్యాచ్‌ జరగనుంది. ఈక్రమంలో దక్షిణాఫ్రికా కెప్టెన్‌ టెంబా బవుమా పలు కీలక వ్యాఖ్యలు చేశాడు. పవర్‌ ప్లే ఓవర్లలో స్వింగ్‌ బౌలింగ్‌ ఎదుర్కోవడమే తమముందున్న అతిపెద్ద సవాల్‌ అని పేర్కొన్నాడు. ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మను అడ్డుకోవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తామని చెప్పాడు. 

‘‘భారత్‌లో కొత్త బంతితో వేసే బౌలర్లను ఎదుర్కోవడం మాకు బిగ్‌ ఛాలెంజ్‌. వికెట్‌కు ఇరువైపులా స్వింగ్‌  అయితే బ్యాటర్లను ఇబ్బందికి గురిచేసే అవకాశం ఉంది. దక్షిణాఫ్రికా పిచ్‌లతో పోలిస్తే ఇక్కడ బంతిగమనం ఎక్కువగా ఉంటుంది. అందుకే పెద్ద సవాల్‌ ఎదుర్కోక తప్పదని చెబుతున్నా. అయితే తొలి ఓవర్లలో ఎక్కువగా వికెట్లను నష్టపోకుండా ఉండేందుకు ప్రయత్నిస్తాం. అప్పుడే మ్యాచ్‌ ముందుకు సాగే కొద్దీ  మాకు అవకాశాలు వస్తాయి. బుమ్రా, భువనేశ్వర్‌ కుమార్ కొత్త బంతితో ఛాలెంజ్‌ విసురుతారు. విరాట్, రోహిత్ స్టార్ బ్యాటర్లు. ఫామ్‌లో ఉన్న వారిని అడ్డుకొనేందుకు మావంతు తీవ్రంగా ప్రయత్నిస్తాం’’ అని వెల్లడించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు