ఆశలన్నీ వీరిపైనే
శ్వేత సెహ్రావత్, షెఫాలీ వర్మ, పర్శవి చోప్రా, అర్చన దేవి.. ఇటీవల దక్షిణాఫ్రికాలో జరిగిన మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్ విజయ పల్లకీ మోసింది వీళ్లే! ఇప్పుడు అదే వేదికలో మరో ప్రపంచకప్ ఆరంభంకానుంది.
మహిళల టీ20 ప్రపంచకప్ 2 రోజుల్లో
శ్వేత సెహ్రావత్, షెఫాలీ వర్మ, పర్శవి చోప్రా, అర్చన దేవి.. ఇటీవల దక్షిణాఫ్రికాలో జరిగిన మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్ విజయ పల్లకీ మోసింది వీళ్లే! ఇప్పుడు అదే వేదికలో మరో ప్రపంచకప్ ఆరంభంకానుంది. మహిళల టీ20 ప్రపంచకప్ ఇంకో రెండు రోజుల్లో మొదలవనుంది. జూనియర్ అమ్మాయిల్లానే.. సీనియర్లూ కప్పు కొట్టాలని కసితో ఉన్నారు. గత టీ20 ప్రపంచకప్ (2020)లో కప్పునకు అడుగు దూరంలో నిలిచిపోయిన టీమ్‌ఇండియా ఈసారి ట్రోఫీ అందుకోవాలంటే వీళ్లు రాణించడం ఎంతో అవసరం..
స్మృతి పైనే ఆశలు
కప్పు గెలవాలంటే.. అన్న ప్రశ్న వినిపించగానే గుర్తొచ్చే పేరు స్మృతి మంధాన. ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా ఆశలన్నీ ఈ ఓపెనర్‌పైనే. కొన్నేళ్లుగా స్థిరంగా రాణిస్తూ జట్టు విజయాల్లో కీలకమవుతోందీ స్మృతి. గతేడాది 26 ఇన్నింగ్స్‌ల్లో 680 పరుగులు చేసిన ఈ అమ్మాయి కొత్త ఏడాదిలో జరిగిన ముక్కోణపు టీ20 సిరీస్‌లో వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో 74 పరుగులు చేయడం తప్పించి అనుకున్నంతగా రాణించలేకపోయింది. అయినా ప్రధాన టోర్నీలో జట్టు ఆశలన్నీ ఆమెపైనే. షెఫాలీతో కలిసి స్మృతి మెరుపు ఆరంభాలను ఇస్తే భారత్‌కు సగం భారం దిగిపోయినట్లే. గత ప్రపంచకప్ (2020)లో సత్తా చాటలేకపోయిన మంధాన (4 మ్యాచ్‌ల్లో 49) ఈసారి జట్టుకు కప్పు అందించాలన్న పట్టుదలతో ఉంది.
హర్మన్ బాదితే..
మెరుపు ఇన్నింగ్స్‌లకు పెట్టింది పేరు హర్మన్‌ప్రీత్ కౌర్. 2017 వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాపై ఆడిన 171 పరుగుల ఇన్నింగ్స్ ఓ సంచలనం. మళ్లీ ఆస్థాయిలో ఎప్పుడూ రాణించకపోయినా హర్మన్ హిట్టింగ్ మిడిలార్డర్‌లో భారత్‌కు పెద్ద ప్లస్ పాయింట్. ఒత్తిడిలో కళ్లుచెదిరే ఇన్నింగ్స్‌లతో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసే సత్తా ఉన్న హర్మన్ ప్రపంచకప్‌లో రాణించడం తొలి ప్రపంచకప్ ఆశిస్తున్న భారత సీనియర్ జట్టుకు అత్యావశ్యకం. భారీ స్కోర్లు చేయకున్నా స్వదేశంలో ఆస్ట్రేలియాతో సిరీస్, తాజాగా ముక్కోణపు సిరీస్‌లో కొన్ని కీలక ఇన్నింగ్స్‌లు (56, 46, 32, 37) ఆడిన హర్మన్ ఫామ్‌లోనే ఉంది. బ్యాటర్‌గానే కాక ఆమె కెప్టెన్సీ అనుభవం జట్టుకు చాలా అవసరం.
షెఫాలీకి రెండో ఛాన్స్
అండర్-19 ప్రపంచకప్ గెలవడంలో అటు బ్యాటర్‌గా ఇటు కెప్టెన్‌గా షెఫాలీవర్మది ద్విపాత్రాభినయం. మూడేళ్ల అంతర్జాతీయ అనుభవాన్ని ఉపయోగించుకున్న షెఫాలీ.. జూనియర్లను సమర్థంగా నడిపించింది. 2020 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో ఓడిన తర్వాత కన్నీళ్లు పెట్టుకున్న షెఫాలీ.. అండర్-19 కప్ గెలిచి ఆ లోటు తీర్చుకుంది. ఇప్పుడు ఆమె లక్ష్యం సీనియర్ల తరఫునా కప్ గెలవడం. ఇందుకోసం ఓపెనర్‌గా ఆమె చేయాల్సింది చాలా ఉంది. స్మృతితో కలిసి శుభారంభాలు అందించడం ముఖ్యం. అండర్-19 ప్రపంచకప్‌లో టాప్ స్కోరర్లలో మూడో స్థానంలో నిలిచిన షెఫాలీ (7 మ్యాచ్‌ల్లో 172) ఆరంభంలో చెలరేగితే ఆపడం ప్రత్యర్థి బౌలర్లకు కష్టమే.
దీప్తి.. అటూ ఇటూ
మ్యాచ్ నడుస్తున్నంతసేపు కెమెరా దీప్తిశర్మపైనే ఎక్కువగా ఉంటుంది. దీనికి కారణం అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌తో పాటు మెరుపు ఫీల్డింగ్‌తో అదరగొట్టడం ఈ ఆల్‌రౌండర్ ప్రత్యేకత. గత ప్రపంచకప్‌లో భారత్ ఫైనల్ చేరడంలో ఆమెది (5 మ్యాచ్‌ల్లో 115 పరుగులు, 4 వికెట్లు) ప్రముఖ పాత్ర. ఇప్పుడు కూడా దీప్తిని జట్టు గట్టిగానే నమ్ముకుంది. దక్షిణాఫ్రికాలో 130పై స్ట్రైక్‌రేట్, 49 శాతం సగటుతో పరుగులు చేసిన అనుభవం ఉన్న దీప్తి.. ప్రపంచకప్‌లో రాణించడం భారత్‌కు కీలకం.
అప్పుడు త్రిష.. ఇప్పుడు అంజలి
అండర్-19 ప్రపంచకప్‌లో భారత విజయంలో తన వంతు పాత్ర పోషించింది తెలుగమ్మాయి గొంగడి త్రిష (7 మ్యాచ్‌ల్లో 116). ఫైనల్లో ఒత్తిడికి లొంగకుండా స్థిమితంగా బ్యాటింగ్ చేసి జట్టును విజయపథంలో నడిపించింది. సీనియర్ జట్టులో మరో తెలుగమ్మాయి కూడా ఉంది ఆమే పేసర్ అంజలి శర్వాణీ. ఎక్కువ అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన అనుభవం లేకపోయినా అవకాశం దొరికితే రాణించే సత్తా ఈ అమ్మాయికి ఉంది. 6 టీ20ల్లో 3 వికెట్లే తీసినా.. పేస్‌కు అనుకూలించే దక్షిణాఫ్రికా పిచ్‌లపై స్థిరంగా బౌలింగ్ చేసే అంజలి జట్టుకు ఎంతో అవసరం.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Cricket: నాన్‌స్ట్రైకర్ రనౌట్.. బ్యాట్ విసిరి కొట్టిన బ్యాటర్
-
General News
Amaravati: రాజధాని అమరావతిపై రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను తిరస్కరించిన సుప్రీంకోర్టు
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Politics News
Chandra Babu: పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో రూపొందించాలి: చంద్రబాబు
-
India News
Supreme Court: ఇందులో హక్కుల ఉల్లంఘనేముంది?: ఫైజల్ ‘అనర్హత’ పిటిషన్‌పై సుప్రీం
-
Movies News
Samantha: దాని కోసం యాచించాల్సిన అవసరం నాకు లేదు..: సమంత