Pakistan: ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ నుంచి పాక్‌ బయటికి?

పాకిస్థాన్‌ ఎలాగైనా స్వదేశంలో ఆసియాకప్‌ మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వాలనే పట్టుదలతో ఉంది. కనీసం నాలుగు తొలి రౌండ్‌ మ్యాచ్‌లనైనా పాక్‌లో నిర్వహించాలని ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ (ఏసీసీ)ను ఒప్పించడానికి ప్రయత్నిస్తోంది.

Updated : 12 May 2023 09:13 IST

కరాచి: పాకిస్థాన్‌ ఎలాగైనా స్వదేశంలో ఆసియాకప్‌ మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వాలనే పట్టుదలతో ఉంది. కనీసం నాలుగు తొలి రౌండ్‌ మ్యాచ్‌లనైనా పాక్‌లో నిర్వహించాలని ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ (ఏసీసీ)ను ఒప్పించడానికి ప్రయత్నిస్తోంది. నాలుగు మ్యాచ్‌లైనా ఇవ్వకపోతే ఏసీసీ నుంచి వెళ్లిపోతామని అంటోంది. టోర్నీలో భాగంగా తమ నాలుగు మ్యాచ్‌లను తమ దేశంలో ఆడతామంటూ పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) ఛైర్మన్‌ నజమ్‌ సేథి చేసిన ప్రతిపాదనను సభ్య దేశాలు ఇప్పటికే తిరస్కరించాయి. ‘‘కనీసం నాలుగు మ్యాచ్‌లకైనా ఆతిథ్యమిచ్చేందుకు అవకాశమిస్తే చాలని సేథి ఏసీసీతో చెప్పాడు’’ అని ఓ పీసీబీ అధికారి తెలిపాడు. ఇందుకు ఏసీసీ అంగీకరించకపోతే తాము ఆసియాకప్‌లో ఆడమని, ఏసీసీ నుంచి వైదొలగుతామని కూడా సేథీ స్పష్టం చేశాడని ఆ అధికారి చెప్పాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు